రావిపూడితో మరో రెండు
టాలీవుడ్ లో రాజమౌళి తర్వాత 100 శాతం విజయాలతో మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా దూసుకుపోతున్న వ్యక్తి అనిల్ రావిపూడి.
టాలీవుడ్ లో రాజమౌళి తర్వాత 100 శాతం విజయాలతో మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా దూసుకుపోతున్న వ్యక్తి అనిల్ రావిపూడి. ఈ సంక్రాంతి కానుకగా అనిల్ నుంచి వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ కూడా కమర్షియల్ గా సూపర్ సక్సెస్ అందుకుంది. సినిమా భారీ కలెక్షన్స్ దిశగా దూసుకుపోతుంది. టాలీవుడ్ లో రీజనల్ మూవీస్ లో అత్యధిక కలెక్షన్స్ అందుకున్న చిత్రంగా ఈ చిత్రం మారబోతోంది.
‘గేమ్ చేంజర్’ తో నిర్మాత దిల్ రాజుకి వచ్చిన భారీ నష్టాన్ని ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ చాలా వరకు రికవరీ చేసిందనే మాట వినిపిస్తోంది. నిర్మాత శిరీష్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. అలాగే దిల్ రాజు కాంపౌండ్ లో వరుస ఫ్లాప్ లకి ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ బ్రేక్ లు వేసింది. ఓ విధంగా డైరెక్టర్ అనిల్ రావిపూడి దిల్ రాజుకి భారీ సక్సెస్ లు ఇస్తూ కష్టకాలంలో అండగా నిలుస్తున్నాడు.
ఈ నేపథ్యంలోనే అనిల్ రావిపూడిని దిల్ రాజు ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు. అనిల్ రావిపూడి ఇప్పటి వరకు 8 సినిమాలు చేస్తే అందులో సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్2, ఎఫ్3, ఇప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’తో మెజారిటీ మూవీస్ దిల్ రాజు బ్యానర్ లోనే తెరకెక్కాయి. ఈ సంక్రాంతికి విన్నర్ గా నిలిచిన అనిల్ రావిపూడి నెక్స్ట్ మెగాస్టార్ చిరంజీవితో సినిమాని పట్టాలెక్కించబోతున్నాడు.
షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నారు. ఇప్పటికే వీరు అనిల్ రావిపూడితో ‘భగవంత్ కేసరి’ చేసి సూపర్ హిట్ అందుకున్నారు. మెగాస్టార్ తో చేయబోయే మూవీని ఈ ఏడాదిలోనే కంప్లీట్ చేసి 2026 సంక్రాంతికి కానుకగా ప్రేక్షకుల ముందుకి తీసుకురావాలని అనిల్ రావిపూడి భావిస్తున్నారు.
ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడితో దిల్ రాజు మరో రెండు ప్రాజెక్ట్స్ లైన్ లో పెట్టారు. నిజానికి సంక్రాంతికి వస్తున్నాం తర్వాత వెంటనే అనిల్ తో మరో సినిమా చేయాలని అనుకున్నారు. అయితే మెగాస్టార్ తో మూవీ కన్ఫర్మ్ కావడంతో దిల్ రాజు ప్రాజెక్ట్స్ వచ్చే ఏడాదికి వాయిదా పడ్డాయి. అయితే ఆ సినిమాలు ఎవరితో ఉంటాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఏది ఏమైనా అనిల్ రావిపూడి సింపుల్ కథలని తీసుకొని వాటికి తనదైన ఎంటర్టైన్మెంట్ జోడించి ప్రేక్షకులకి కావాల్సిన వినోదాన్ని అందిస్తున్నాడు. దీంతో వరుస సక్సెస్ లు లభిస్తున్నాయి. ఇదే లైన్ లో మూవీస్ చేసుకుంటూ వెళ్తే అతని జోరుకి ఇప్పట్లో బ్రేక్ పడే అవకాశం లేదనే మాట వినిపిస్తోంది.