భారతదేశంలో అత్యధిక పారితోషికం పొందే TV నటి
ఒక్కో ఎపిసోడ్‌కు రూ. 18 లక్షలు వసూలు చేసే సదరు యువనటికి ఏకంగా రూ. 250 కోట్ల విలువ చేసే నికర ఆస్తులు ఉన్నాయి.
భారతదేశంలో అత్యధిక పారితోషికం అందుకునే బుల్లితెర (టీవీ) నటి ఎవరు? ఆస్తి ఐశ్వర్యంలోను ఎవరు నం.1 టీవీ నటి? అంటే దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఒక్కో ఎపిసోడ్‌కు రూ. 18 లక్షలు వసూలు చేసే సదరు యువనటికి ఏకంగా రూ. 250 కోట్ల విలువ చేసే నికర ఆస్తులు ఉన్నాయి. ఈ బుల్లితెర నటి పేరు జన్నత్ జుబైర్.
కేవలం 21 ఏళ్ల వయసులో జన్నత్ జుబైర్ ముంబైలో సొంతంగా ఒక ఇల్లు కొన్నారు. ఆమె ఆస్తులు 250 కోట్లు. కేవలం 23 సంవత్సరాల వయసులో అసాధారణ అభిమానులను సంపాదించుకున్న ఈ భామ.. చాలామంది అగ్ర సినీతారల కంటే ధనికురాలిగా ఘనుతికెక్కారు. ఆమె టెలివిజన్ పరిశ్రమలో అత్యధిక సంపాదన కలిగిన నటి.
జన్నత్ జుబైర్.. బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ కంటే ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్న రైజింగ్ స్టార్. షారూఖ్ కి ఇన్‌స్టాగ్రామ్‌లో 46 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ సహా భారీగా అభిమానులు ఉన్నారు. అయితే జన్నత్ జుబైర్ ఇన్‌స్టాలో 49.7 మిలియన్ల మంది ఫాలోవర్స్‌తో ఆయనను అధిగమించారు. కేవలం ఫాలోయింగ్ లోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా అగ్రశ్రేణి ప్రభావశీలులలో ఒకరిగా ఉన్నారు.
29 ఆగస్టు 2001న ముంబైలో జన్మించిన జన్నత్ బుల్లితెరపై బాలనటిగా కెరీర్‌ను ప్రారంభించింది. ఇప్పుడు సినీ రంగం సహా టీవీ రంగంలో పెద్ద స్టార్ అయింది. దిల్ మిల్ గయే, కాశీ: అబ్ నా రహే తేరా కాకా, ఫుల్వా, మహారాణా ప్రతాప్, తు ఆషికి , ఫియర్ ఫైల్స్ వంటి పాపులర్ టీవీ షోలలో జన్నత్ నటించింది. రాణి ముఖర్జీ నటించిన బాలీవుడ్ చిత్రం హిచ్కిలో కూడా నటించింది. `ఫియర్ ఫ్యాక్టర్: ఖత్రోన్ కే ఖిలాడి 12`, లాఫ్టర్ ఛాలెంజ్ వంటి అనేక రియాలిటీ షోలలో పాల్గొంది. చాలా ప్రైవేట్ మ్యూజిక్ ఆల్బమ్‌లలో కూడా కనిపించింది. ఖత్రోన్ కే ఖిలాడి షోలో అత్యధిక పారితోషికం పొందిన పోటీదారుగా నిలిచింది.
ఖత్రోన్ కే ఖిలాడిలో ఎపిసోడ్‌కు జన్నత్ జుబైర్ 18 లక్షల పారితోషికం ఆర్జించారని కథనాలొచ్చాయి. లాఫ్టర్ ఛాలెంజ్ ఎపిసోడ్‌కు 2 లక్షలు అందుకుంది. సోషల్ మీడియాల ద్వారాను ఆదాయం భారీగా ఉంది. ఒక్కో పోస్ట్‌కు రూ.1.5 లక్షల నుంచి 2 లక్షల రూపాయలు ఆర్జిస్తోంది. కేవలం 21 సంవత్సరాల వయసులో జన్నత్ జుబైర్ ముంబైలో తన సొంత ఇంటిని కొనుగోలు చేయడం తన స్థాయిని చెబుతోంది. అత్యంత విజయవంతమైన వ్యాపారవేత్తగాను జన్నత్ జుబైర్ రాణిస్తోంది.