తమిళ నటులు రిస్క్ తీసుకోరు.. ప్రయోగాలు చేయరు!
అదే సమయంలో పలు ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై బజ్ క్రియేట్ చేస్తున్నారు గౌతమ్ మీనన్. రీసెంట్ గా ఇంటర్వ్యూలో తమిళ, మలయాళ నటుల మధ్య తేడా గురించి మాట్లాడారు.
కోలీవుడ్ దర్శకుడు గౌతమ్ మీనన్ కు మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. ఏ మాయ చేశావే, ఘర్షణ, సూర్య సన్నాఫ్ కృష్ణన్, ఎటో వెళ్ళిపోయింది మనసు, సాహసం శ్వాసగా సాగిపో వంటి ఎన్నో క్లాసిక్ సినిమాలను ప్రేక్షకులకు అందించారు. మంచి హిట్స్ సొంతం చేసుకుని తన టాలెంట్ ఏంటో చూపించారు.
అయితే కొన్నాళ్లుగా దర్శకుడిగా కంటే నటుడిగానే ఎక్కువ బిజీగా ఉన్నారు గౌతమ్ మీనన్. పలు సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్ అనే మలయాళం సినిమాకు దర్శకత్వం వహించారు. రీసెంట్ గా జనవరి 23వ తేదీన ఆ మూవీ రిలీజ్ అవ్వగా.. మిక్స్ డ్ రెస్పాన్స్ వచ్చింది.
అదే సమయంలో పలు ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై బజ్ క్రియేట్ చేస్తున్నారు గౌతమ్ మీనన్. రీసెంట్ గా ఇంటర్వ్యూలో తమిళ, మలయాళ నటుల మధ్య తేడా గురించి మాట్లాడారు. 2019లో రిలీజ్ అయిన మాలీవుడ్ మూవీ కుంబలంగి నైట్స్ గురించి ప్రస్తావించారు. అందులో ఫహాద్ ఫాజిల్ యాక్ట్ చేసిన విషయం తెలిసిందే.
సినిమాలో ఆయన రోల్ ఛాలెంజింగ్ గా ఉంటుంది. ఇప్పుడు ఆ విషయాన్ని ఉదాహరణగా తీసుకున్నారు. ఫహద్ పోషించిన రోల్ కు తమిళ నటులు మాత్రం ఒప్పుకోరని వ్యాఖ్యానించారు. తమిళ నటులు ఎల్లప్పుడూ అసాధారణ పాత్రలను తీసుకోవడం కంటే కమర్షియల్ రోల్స్ ను ఎంచుకుంటూ ఉంటారని తెలిపారు.
బాక్సాఫీస్ వద్ద విజయానికి హామీ ఇచ్చే పాత్రలను ఎంచుకునేలా తమిళ సినిమా వాణిజ్య స్వభావం చేస్తుందని చెప్పారు గౌతమ్ మీనన్. మార్కెట్ సామర్థ్యంపై దృష్టి పెట్టడం వల్ల కుంబలంగి నైట్స్ లో ఫాజిల్ వంటి సంక్లిష్టమైన లేదా అసాధారణ పాత్రలపై రిస్క్ తీసుకోవడానికి కోలీవుడ్ యాక్టర్స్ ఇష్టపడరని వ్యాఖ్యానించారు.
ఫహాద్ తో పాటు పలువురు మలయాళ నటులు సంక్లిష్టమైన సామాజిక సమస్యలను పరిష్కరించే పాత్రలతో సహా విభిన్న పాత్రలతో ప్రయోగాలు చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని తెలిపారు. కోలీవుడ్.. విజయవంతమైన మలయాళ చిత్రాలు రీమేక్ చేస్తుందని తెలిపారు. అలాంటి కంటెంట్ తో సినిమాలు చేయడం లేదని అన్నారు. మాలీవుడ్ మాత్రం ప్రయోగాలు చేస్తుందని పేర్కొన్నారు.