పుష్ప-2 బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. నిజంగా 90% సామ్ అందించారా?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, జీనియస్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప-2 రిలీజ్ కు ముందు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో తలెత్తిన వివాదం గురించి అందరికీ తెలిసిందే.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, జీనియస్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప-2 రిలీజ్ కు ముందు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో తలెత్తిన వివాదం గురించి అందరికీ తెలిసిందే. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మెయిన్ మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేసినప్పటికీ.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం ప్రాజెక్ట్ లోకి ముగ్గురు సంగీత దర్శకులను తీసుకున్నారు సుక్కూ.
ఎస్ ఎస్ తమన్, అజనీష్ లోక్ నాథ్ ను రంగంలోకి దించారు. దీంతో అప్పుడు ఆ విషయంపై జోరుగా చర్చ సాగింది. అయితే సామ్ సీఎస్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రమే ఉపయోగించారని, మిగతా ఇద్దరి వర్క్ ను పక్కన పెట్టారని తెలిసింది. ఎందుకంటే తమన్, అజనీష్ పేర్లు టైటిల్ కార్డ్స్ లో వేయలేదు మేకర్స్.
సామ్ సీఎస్ పేరును అడిషనల్ మ్యూజిక్ డైరెక్టర్ గా వేశారు. ఆ తర్వాత ఓ ఇంటర్వ్యూలో ఆయన.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో 90 శాతం వర్క్ తానే చేశానని చెప్పారు. దేవి శ్రీ కొన్ని కీలక సన్నివేశాలకు బీజీఎం అందించారని అన్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వల్ల తనకు ఆ ఛాన్స్.. పుష్ప-2 మేకర్స్ ఇచ్చారని తెలిపారు.
అయితే తాజాగా టీ సిరీస్ యూట్యూబ్ ఛానల్‌లో పుష్ప 2 ఒరిజినల్ సౌండ్ ట్రాక్స్ (OST) విడుదలైన విషయం తెలిసిందే. 33 నిమిషాల జ్యూక్ బాక్స్ లో ప్రతి సౌండ్ ట్రాక్ ను దేవిశ్రీ కంపోజ్ చేసినట్లు తెలిపారు. కానీ సామ్ సీఎస్ పేరును మాత్రం ప్రస్తావించలేదు. దీంతో ఆయన.. తన సౌండ్ ట్రాక్స్ రిలీజ్ చేస్తానని, 99% లోడింగ్ అంటూ పోస్ట్ పెట్టారు.
చెప్పినట్లు దాదాపు 16 నిమిషాల 18 సెకన్ల నిడివి గల మొత్తం 18 ట్రాకులను పోస్ట్ చేశారు సామ్ సీఎస్. అదే సమయంలో డీఎస్పీ OST జ్యూక్ బాక్స్ డ్యురేషన్ 33 నిమిషాల 29 సెకన్లు. అంటే కీలకమైన సన్నివేశాలతో సహా సినిమా కోసం ఎక్కువ భాగం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను డీఎస్పీ కంపోజ్ చేసినట్లు చాలా క్లియర్ గా అర్థమవుతుంది.
అదే సమయంలో సామ్ సీఎస్ కూడా కొన్ని సన్నివేశాలకు సంగీతం సమకూర్చినట్లు కనిపిస్తుంది. కానీ ఆయన చెప్పినట్లుగా 90% కాదని నెటిజన్లు అంటున్నారు. రెండు OSTలను కంపేర్ చేసి భిన్నమైన అభిప్రాయాలను కొందరు వ్యక్తపరుస్తున్నారు. తక్కువ సమయంలో మంచి వర్క్ అందించారని సామ్ ను కొనియాడుతున్నారు. మరికొందరు మాత్రం డీఎస్పీకి మొత్తం క్రెడిట్ దక్కాలని.. ఆయన ఎక్కువ వర్క్ చేశారని అభిప్రాయపడుతున్నారు.