నభా నటేష్… లుక్స్ తోనే కేక పుట్టిస్తోందిగా..
అందాల భామ నభా నటేష్ కి సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ బ్యూటీ ‘వజ్రకాయ’ మూవీతో హీరోయిన్ గా తెరంగేట్రం చేసింది.
అందాల భామ నభా నటేష్ కి సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ బ్యూటీ ‘వజ్రకాయ’ మూవీతో హీరోయిన్ గా తెరంగేట్రం చేసింది. ఈ సినిమా తర్వాత కన్నడంలో వరుసగా అవకాశాలు వచ్చాయి. సుధీర్ బాబు ‘నన్ను దోచుకుందువటే’ మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ హిట్ టాక్ సొంతం చేసుకుంది.
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీతో నభా నటేష్ కి మంచి క్రేజ్ వచ్చింది. తరువాత వరుసగా ‘డిస్కో రాజా’, ‘సోలో బ్రతుకే సో బెటరు’, ‘అల్లుడు అదుర్స్’, ‘మ్యాస్ట్రో’ సినిమాలు చేసింది. ఈ సినిమాలలో ఏదీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. తరువాత ఓ యాక్సిడెంట్ కారణంగా మూడేళ్లు నభా నటేష్ సినిమాలకి దూరమైపోయింది.
మరల ‘డార్లింగ్’ మూవీతో గత ఏడాది నభా నటేష్ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసింది. ఈ మూవీ పెద్దగా మెప్పించలేదు. ప్రస్తుతం ‘స్వయంభు’ సినిమాలో ఈ అమ్మడు హీరోయిన్ గా చేస్తోంది. నిఖిల్ హీరోగా పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇదిలా ఉంటే నభా నటేష్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.
రెగ్యులర్ గా గ్లామర్ ఫోటోలని నభా నటేష్ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బ్లాక్ కలర్ ఇన్నర్స్ తో అదిరిపోయే స్టైల్ లో ఫోటోలని షేర్ చేసింది. ఈ ఫోటోలు ప్రస్తుతం ట్రెండ్ అవుతున్నాయి.
నభా నటేష్ గ్లామర్ ఫోటోలకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ కాస్ట్యూమ్స్ లో అమ్మడు చాలా గ్లామరస్ గా ఉందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ స్థాయిలో అందాల ప్రదర్శన చేస్తూ ఉంటే కచ్చితంగా నభాకి మరింత పాపులారిటీ పెరిగిపోవడం గ్యారెంటీ అనుకుంటున్నారు. ‘స్వయంభు’ సినిమాపైన నభా నటేష్ చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. ఈ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ రావడంతో పాటు హీరోయిన్ గా క్రేజ్ పెరుగుతుందని అనుకుంటుంది. మరి ఆ సినిమా ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందో చూడాలి.