వారి ప్రవర్తన అసలు బాగాలేదు : మంచు లక్ష్మి
సినీ నటి మంచు లక్ష్మి సోషల్ మీడియా ద్వారా రెగ్యులర్‌గా ఏదో ఒక విషయాన్ని షేర్ చేస్తూ ఉంటారు.
సినీ నటి మంచు లక్ష్మి సోషల్ మీడియా ద్వారా రెగ్యులర్‌గా ఏదో ఒక విషయాన్ని షేర్ చేస్తూ ఉంటారు. ఎక్కువగా తన లైఫ్ స్టైల్, ఫ్యామిలీ, తన ప్రాజెక్ట్, మోడలింగ్ ఇలాంటి విషయాల గురించి షేర్ చేస్తూ ఉంటారు, అప్పుడప్పుడు సామాజిక విషయాల గురించి, అవగాహణ కార్యక్రమాల్లో భాగంగా కొన్ని పోస్ట్‌లను షేర్ చేస్తారు. అయితే ఈసారి మంచు లక్ష్మి ఒక ఎయిర్ లైన్స్ తీరుతో తనకు కలిగిన అసౌకర్యం గురించి ట్వీట్ చేశారు. ఇటీవల తాను చేసిన విమాన ప్రయాణ అనుభవాలను, ఆ సమయంలో తాను ఎదుర్కొన్న చెడ్డ అనుభవంను గురించి మంచు లక్ష్మి సోషల్ మీడియా ద్వారా అందరితోనూ షేర్ చేసుకుంది.
ఇండిగో ఎయిర్‌లైన్స్ సిబ్బంది తీరుపై మంచు లక్ష్మి అసహనం వ్యక్తం చేసింది. వారి యొక్క ప్రవర్తన అసలు బాగాలేదని ఫిర్యాదు చేసింది. నా బ్యాగేజ్‌ను పూర్తిగా పక్కకు నెట్టి వేశారు. అంతే కాకుండా తన బ్యాగ్‌ను కనీసం ఓపెన్ చేసుకునేందుకు అవకాశం ఇవ్వలేదు. బ్యాగేజ్ విషయంలో వారు చెప్పిన విధంగా చేయకుంటే ఆ బ్యాగ్‌ను గోవాలోనే వదిలేయాల్సి ఉంటుందని వారు హెచ్చరించారు. తాను ఎంత రిక్వెస్ట్‌గా మాట్లాడిన వారి నుంచి మాత్రం సరైన స్పందన రాలేదు. వారి నుంచి వచ్చిన దురుసు సమాధానం విని తాను షాక్ అయ్యాను అంటూ మంచు లక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు.
తనకు ఎదురైన ఇబ్బంది మరెవ్వరికీ కాకూడదనే ఉద్దేశ్యంతో ఈ విషయాన్ని షేర్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇదో రకం వేధింపు. నేను చూస్తూ ఉండగానే బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించారు. నేను చూస్తుండగా బ్యాగేజ్‌కి ట్యాగ్ వేసేందుకు నిరాకరించారు. ట్యాగ్ వేయకుండా లోనికి తీసుకు వెళ్తే అందులో ఏమైనా వస్తువులు మిస్ అయితే సంస్థ బాధ్యత తీసుకుంటుందా అంటూ మంచు లక్ష్మి ప్రశ్నించారు. ఈ ప్రయాణంలో తాను మాత్రమే కాకుండా తన వంటి ఎంతో మంది ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విధమైన సిబ్బందితో, ఇలాంటి పద్దతితో ఎలా మీరు ఎయిర్‌లైన్స్ నడిపిస్తున్నారు అంటూ యాజమాన్యం తీరుపై మంచు లక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంచు లక్ష్మి గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఇంతకు ముందు నటిగా బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటించారు. అంతే కాకుండా సినిమా నిర్మాణంలోనూ ఉన్నారు. కానీ ఇప్పుడు మోడలింగ్‌లో అప్పుడప్పుడు కనిపిస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో అప్పుడప్పుడు ఫోటోలు షేర్ చేస్తున్నారు. తన ఫ్యామిలీలో పెద్ద గొడవ జరుగుతున్నా ఇప్పటి వరకు మంచు లక్ష్మి ఆ విషయమై స్పందించలేదు. ఈ వ్యవహారంలో మంచు లక్ష్మి ఎవరి సైడ్ అంటూ ఆ మధ్య చాలా చర్చ జరిగింది. కానీ తాను మాత్రం ఎటు వైపు లేను అన్నట్లుగానే మౌనంగా ఉంది.