సౌత్ సినిమా రీమేక్ లో అభిషేక్ బ‌చ్చ‌న్!

Update: 2022-12-01 04:56 GMT
సౌత్ సినిమాలు పాన్ ఇండియాలో ఎలా వెలిగిపోతున్నాయో చెప్పాల్సిన ప‌నిలేదు. కొంత కాలంగా ఇండియ‌న్ సినిమాలో సౌత్ సినిమాల‌దే హ‌వా. హిందీ సినిమాల్ని సైతం ప‌క్క‌కు నెట్టి మ‌రీ తెలుగు..క‌న్న‌డ సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద దుమారం సృష్టిస్తున్నాయి. సౌత్ కంటెంట్ కి ఉన్న డిమాండ్ ఇప్పుడు దేశంలో మ‌రో ప‌రిశ్ర‌మ‌కి లేద‌న్న‌ది వాస్త‌వం.

ఈ నేప‌థ్యంలో తాజాగా అభిషేక్ బ‌చ్చ‌న్ కోలీవుడ్ హిట్ సినిమా 'కేడీ' రీమేక్ లో న‌టించ‌డానికి రెడీ అవుతున్నారు. 'కేడీ' త‌మిళ్ లో భారీ విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. ప‌లు అంత‌ర్జాతీయ పుర‌స్కారాలు సైతం ద‌క్కించుకుంది.  ఓపెద్దాయ న‌..ఎనిమిదేళ్ల కుర్రాడి నేప‌థ్యంలో సాగే స్టోరీ ఇది.  ఇందులో వృద్దుడి పాత్ర ఎంతో ఆస‌క్తిక‌రంగా సాగుతుంది.

సినిమా క‌మ‌ర్శియ‌ల్ గా మంచి విజ‌యం సాధించింది. ఈ నేప‌థ్యంలో ఈ క‌థ‌ని హిందీ లీ రీమేక్ చేయ‌డానికి రెడీ అవుతున్నారు. వృద్దుడి పాత్ర‌లో అభిషేక్ బ‌చ్చ‌న్ న‌టించ‌నున్నారు. మాతృక‌కు ద‌ర్శ‌కత్వం వ‌హించిన మ‌ధుమిత సుంరామ‌న్ హిందీ వెర్ష‌న్ కి ప‌నిచేసేలా అభిషేక్ స‌న్నాహాలు చేస్తున్నారు.  జ‌న‌వ‌రిలో భోపాల్ లో షూటింగ్  ప్రారంభించాల‌ని ప్లాన్ చేస్తున్నారు.

అయితే  కొన్నాళ్లుగా బాలీవుడ్ కి  స‌రైన విజ‌యాలు లేక‌పోవ‌డంతో హీరోలు సహా ద‌ర్శ‌క‌-నిర్మాతలంతా విమ‌ర్శ‌లు ఎదుర్కోంట‌న్న సంగతి తెలిసిందే. మ‌న‌లో మ్యాట‌ర్లేక ప‌క్క  భాషల సినిమాల్ని రీమేక్ చేస్తున్నారా? అంటూ ఎద్దేవా చేస్తున్నారు.  కానీ అభిషేక్ బ‌చ్చ‌న్  వీటిని మే మాత్రం ప‌ట్టించుకోకుండా ముందుకు సాగిపోతున్నారు.

ప్ర‌స్తుతం  అక్క‌డి ద‌ర్శ‌కులెవ‌రు ఫాం లేరు. అగ్ర హీరోల ద‌ర్శ‌కులంతా ఒకే  ఫేజ్ లోఉన్నారు. మీడియం రేంజ్ మేక‌ర్స్ అంతా కంటెంట్ బేస్డ్ చిత్రాల‌తో బిజీగా ఉన్నారు. వాళ్ల‌తో స్టార్స్  సినిమా చేసే సాహ‌సం చేయ‌రు. అందుకే హిట్ ద‌ర్శ‌కుల్నే న‌మ్ముకో వాల‌ని అభిషేక్ కేడీ రీమేక్ విష‌యంలో మాతృక మేక‌ర్ ని రంగంలోకి దించుతున్న‌ట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని నిర్మించేది కూడా ఓ ద‌ర్శ‌క‌-నిర్మాతే. ఆయ‌నే  నిఖిల్  అద్వానీ. అభిషేక్ స‌హా ఈయ‌న‌కి క‌థ న‌చ్చ‌డంతో భారీ ధ‌ర‌కి రైట్స ద‌క్కించుకున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News