రామ్ చ‌ర‌ణ్ థాంక్స్ వెరీ ఇంట్రెస్టింగ్!

త‌న‌యుడికి తండ్రి..తండ్రికి త‌న‌యుడు కృతజ్ఞ‌త చెప్పుకునే సంద‌ర్భం ఏదైనా ఉంటుందా? అంటే చాలా రేర్ కేసెస్ లోనే చోటు చేసుకుంటుంది.

Update: 2024-12-24 06:56 GMT

త‌న‌యుడికి తండ్రి..తండ్రికి త‌న‌యుడు కృతజ్ఞ‌త చెప్పుకునే సంద‌ర్భం ఏదైనా ఉంటుందా? అంటే చాలా రేర్ కేసెస్ లోనే చోటు చేసుకుంటుంది. అదీ తండ్రికి మాత్రమే త‌న‌యుడు విధేయుడిగా ఉంటాడు త‌ప్ప‌! త‌న‌యుడికి ఎప్పుడికి ఎప్పుడూ తండ్రి విధేయుడు గా ఉండ‌డు. ఆ ఇద్ద‌రి మ‌ధ్యా ఉండే బాండింగ్ అన్నది ఎంతో ప్ర‌త్యేక‌మైన‌ది. అలా మెగాస్టార్ చిరంజీవికి త‌న‌యుడు రామ్ చ‌ర‌ణ్ తొలిసారి త‌న‌ని ఇండ‌స్ట్రీకి తీసుకొచ్చిన కొత్త‌లో కృత‌జ్ఞ‌త చెప్పారు.

మెగా అభిమానుల‌కు త‌న‌యుడిని ప‌రిచ‌యం చేసిన సంద‌ర్భంలో ఈ స‌న్నివేశం చోటు చేసుకుంది. అటుపై చ‌ర‌ణ్ స్టార్ గా ఎదిగిన త‌ర్వాత కోట్లాది మంది అభిమానం చూసి ఆనందంతో ఉబ్బిత‌బ్బిబి మ‌రోసారి డాడ్ కు థాంక్స్ చెప్పారు. ఆ త‌ర్వాత మళ్లీ అలాంటి స‌న్నివేశం ఇద్ద‌రి మ‌ధ్య చోటు చేసుకోలేదు. తండ్రికి త‌గ్గ త‌న‌యుడు చ‌ర‌ణ్. నేడు రామ్ చ‌ర‌ణ్ గ్లోబ‌ల్ స్టార్. అంత‌టి గ్లోబ‌ల్ స్టార్ మళ్లీ చాలా కాలానికి చిరంజీవికి థాంక్స్ చెప్పి హైలైట్ అయ్యారు. సంక్రాంతి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తోన్న `గేమ్ ఛేంజ‌ర్` రిలీజ్ అవుతున్న సంగ‌తి తెలిసిందే.

ఇదే సీజ‌న్ లో చిరంజీవి న‌టిస్తోన్న `విశ్వంభ‌ర` కూడా రిలీజ్ ప్లాన్ చేసుకున్నారు. కానీ అటుపై రిలీజ్ వాయిదా వేసుకున్నారు. సినిమాకి సంబంధించిన ప‌నులు డిలే కావ‌డంతోనే `విశ్వంభ‌ర` వాయిదా వేస్తున్న‌ట్లు ప్ర‌చారంలోకి వ‌చ్చింది. కానీ అస‌లు కార‌ణం అది కాద‌ని అమెరికా ఈవెంట్ లో రామ్ చ‌ర‌ణ్ మాట‌ల్ని బ‌ట్టి క్లారిటీ వ‌చ్చింది. త‌న‌యుడు కోసం తండ్రి త‌న సినిమాని వాయిదా వేసుకున్న‌ట్లు అర్ద‌మైంది.

ఈ విష‌యాన్ని స్వ‌యంగా రామ్ చ‌ర‌ణ్ రివీల్ చేసారు. `చిరంజీవి గారు..మా నాన్న కు` థాంక్స్ అని చ‌ర‌ణ్ మాట్లాడారు. అప్పుడే విష‌యం అర్ద‌మైంది త‌న‌యుడి కోసం తండ్రి వెన‌క్కి త‌గ్గార‌ని. ఓసంద్భంలో చిరంజీవి-చ‌ర‌ణ్ మ‌ధ్య డాన్స్ విష‌యంలో పోటీ రావ‌డంతో? `నీ బాబు నా రా నేను` అంటారు. అందుకు చ‌ర‌ణ్ `త‌గ్గ‌ను డాడీ` అంటాడు. `నేను నీ కొడుకుని త‌గ్గితే ఎలా? అంటే `ఆచార్య సెట్స్ లో చూసుకుందామ‌ని` చిరు అంటారు. కానీ రిలీజ్ విష‌యంలో త‌న‌యుడు కోసం తండ్రి వెన‌క్కి త‌గ్గారు. అలా మ‌రోసారి అన్న‌య్య త‌న‌యుడి బాధ్య‌త తీసుకున్నారు.

Tags:    

Similar News