గత నెలలో కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అవ్వడంతో ముంబయి నానావతి ఆసుపత్రిలో జాయిన్ అయిన బచ్చన్ కుటుంబ సభ్యులు ఒక్కరు ఒక్కరుగా మొత్తం క్యూర్ అయ్యారు. మొదట ఐశ్వర్య రాయ్ మరియు ఆరాధ్యలు కరోనాను జయించారు. ఆ తర్వాత రెండు వారాల గ్యాప్ లో అమితాబచ్చన్ కూడా కరోనా నెగటివ్ అంటూ రిపోర్ట్ వచ్చింది. ఇక మిగిలింది అభిషేక్ బచ్చన్. ఆయన గురించి గత వారం రోజులుగా కుటుంబ సభ్యులు మరియు అభిమానులు ప్రార్థనలు చేశారు. ఎట్టకేలకు ఆయన కూడా కరోనా ను జయించాడు.
భారతదేశంలో అతి ప్రముఖ సెలబ్రెటీ అయిన అమితాబచ్చన్ కరోనా పాజిటివ్ అంటూ రావడంతో దేశ వ్యాప్తంగా చర్చ జరిగింది. ఆయన కరోనాను జయించడంతో అంతా కూడా ఆయన మానసిక దృడత్వంను అభినందించారు. ఇదే సమయంలో జూనియర్ బచ్చన్ ఇంకా కరోనాతో ఉండటంతో ఆయన్ను చాలా మంది ట్రోల్ చేశారు. వృద్దుడు అయిన తండ్రి కరోనాను జయించాడు. ఆయన వారసుడు అయిన నీవు ఎందుకు కరోనా విముక్తి పొందలేక పోతున్నావు అంటూ రకరకాలుగా ప్రశ్నించారు.
కొందరు ఆయన కోలుకోవాలంటూ కోరుకుంటూ ట్వీట్స్ చేయగా ఇటీవలే ఆయన సోదరి కూడా నీవు సాధించగలవు అంటూ ట్వీట్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. ఎట్టకేలకు అభిషేక్ బచ్చన్ కూడా కరోనా విముక్తి పొందాడు. అతి త్వరలోనే ఆయన ఇంటికి చేరుకుని కూతురు ఆరాధ్యతో ఆటలాడబోతున్నాడు అంటూ ఆసుపత్రి వర్గాల వారు ప్రకటించారు.