రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా హైవే అనే కొత్త సినిమా ఇటీవలే ప్రారంభం అయిన విషయం తెల్సిందే. కేవీ గుహన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ సినిమా చాలా విభిన్నమైన కాన్సెప్ట్ తో కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా ఇటీవల చిత్ర యూనిట్ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ పేర్కొన్నారు. తప్పకుండా ఇది అందరు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుందని వారు చెబుతున్నారు. ఈ సినిమా లో ఆనంద్ దేవరకొండకు జోడీగా మలయాళి ముద్దుగుమ్మ మానస రాధాకృష్ణన్ ను ఎంపిక చేశారు. తాజాగా ఈ సినిమాలో అభిషేక్ బెనర్జీ ఎంపిక అయ్యాడు.
అభిషేక్ బెనర్జీ తెలుగు ప్రేక్షకులకు కొత్తవాడు. కాని ఆయన హిందీలో మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. ఇప్పటి వరకు తెలుగు లో ఈయన నటించలేదు. కాని తెలుగు ప్రేక్షకులకు కాస్త అయినా మీర్జాపూర్ ద్వారా పరిచయం అయ్యాడు. ఓటీటీ వెబ్ సిరీస్ మీర్జా పూర్ లో ఈయన కీలక పాత్రలో నటించాడు. ఆ బూతుల వెబ్ సిరీస్ కు అన్ని చోట్ల కూడ మంచి స్పందన వచ్చింది. కనుక ఈయనకు నటుడిగా మంచి గుర్తింపు వచ్చింది. నటుడిగా ఉత్తరాదిన మంచి గుర్తింపు దక్కించుకున్న అభిషేక్ కు తెలుగు 'హైవే' లో ఛాన్స్ వచ్చింది.
ఈ నటుడు ఆనంద్ దేవరకొండ సినిమాలో ఏ పాత్రను పోషించబోతున్నాడు అనే విషయం ఇంకా స్పష్టత రాలేదు. కాని ఈ సినిమా తర్వాత తెలుగు లో ఈయన బిజీ అవుతాడని మాత్రం యూనిట్ సభ్యులు చెబుతున్నారు. మొత్తానికి తెలుగు లోకి ఉత్తరాది నుండి మరో స్టార్ రాబోతున్నారు. గతంలో వచ్చిన పలువురు మంచి విజయాలను దక్కించుకున్నారు. కనుక ఈయన కూడా తప్పకుండా విజయాన్ని సొంతం చేసుకుంటారనే నమ్మకంను అంతా వ్యక్తం చేస్తున్నారు. ఆనంద్ దేవరకొండ వరుసగా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇప్పటికే పుష్పక విమానంను చేసి విడుదలకు సిద్దం చేసిన ఈయన హైవే సినిమాను కూడా ఇదే ఏడాదిలో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నాడు.