గత కొన్ని రోజులుగా తమిళ నటుడు అభి శరవణన్ మరియు నటి అతిథి మీనన్ ల మద్య వివాదం కొనసాగుతుంది. వీరిద్దరు కూడా ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకుని న్యాయస్థానాల చుట్టు తిరుగుతున్నారు. వీరిద్దరు కూడా ఒకరిపై ఒకరు సంచలన ఆరోపణలు చేసుకుంటూ వివాదాన్ని మరింతగా పెంచుతున్నారు. తాజాగా అతిథి మీనన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తప్పుడు పత్రాలతో అభి నాపై ఆరోపణలు చేస్తున్నాడని ఆమె ఆరోపిస్తుంది. అయితే అభి మాత్రం మరో విధంగా స్పందిస్తున్నాడు.
తాజాగా అభి శరవణన్ మీడియాతో మాట్లాడుతూ సంచలన విషయాలను బయట పెట్టాడు. 2016వ సంవత్సరంలో అతిథిని తాను రిజిస్ట్రర్ మ్యారేజ్ చేసుకున్నాను. పెళ్లి విషయం అమెరికాలో ఉండే వారి కుటుంబ సభ్యులకు కూడా తెలుసు. వారు ఒప్పుకున్న తర్వాత రిజిస్ట్రర్ మ్యారేజ్ చేసుకున్నాం. ఇద్దరం కూడా కలిసి మూడు సంవత్సరాల పాటు జీవితాన్ని గడిపాం. పలు సార్లు కేరళలోని వారి ఇంటికి వెళ్లాం. మా పెళ్లి రిజిస్ట్రర్ అయినట్లుగా సర్టిఫికెట్ కూడా ఉంది. కాని అతిథి మాత్రం ఇప్పుడు అసలు పెళ్లి జరగనట్లుగా మాట్లాడుతుందని అన్నాడు.
ఆమద్య గజా తుఫాన్ సహాయక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు నేను వెళ్లిన సమయంలో అతిథి ఇంట్లో ఉన్న డబ్బు, నగలు, కొన్ని డాక్యుమెంట్లు తీసుకుని పారిపోయిందని ఆరోపిస్తున్నాడు. ప్రస్తుతం ఒక వ్యాపారవేత్త కుమారుడితో ఈమె సహజీవనం సాగిస్తుందని ఆరోపించాడు. నాతో పెళ్లికి ముందు కేరళలో ఒక వ్యక్తితో ప్రేమ వ్యవహారం సాగించిన అతిథి ఇప్పుడు మరో వ్యక్తితో సహజీవనం సాగిస్తుందంటూ ఆరోపణలు చేశాడు. ఇప్పటికి అయినా ఆమె మారి తన వద్దకు వస్తే తప్పకుండా ఆమెతో జీవితాన్ని పంచుకోవడానికి నాకేం ఇబ్బంది లేదని, ఆమెను తన వద్దకు వచ్చేలా ఆదేశించాలంటూ కోర్టును ఆశ్రయించాడు. మరో వైపు అభితో తనకు పెళ్లి కాలేదని, అది తప్పుడు దృవ పత్రం అంటూ అతిథి ఆరోపిస్తుంది. వీరిద్దరి వ్యవహారం సాగుతూనే ఉంది.