మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న `ఆచార్య` మే 14న రిలీజ్ కావాల్సి ఉండగా ఈ సినిమా వాయిదా పడనుందని ఇటీవల ప్రచారమైంది. సెకండ్ వేవ్ ప్రభావంతో కొరటాల ఇప్పటికే షూటింగ్ ఆపేశారు. చిరు ప్రస్తుతం గృహనిర్భంధంలోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే రిలీజ్ తేదీ మారితే ఎప్పటికి వస్తుంది? అన్నదానిపై తాజాగా ఇన్ సైడ్ గుసగుస ఏం చెబుతోంది అంటే..?
22 ఆగస్టు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కానుకగా `ఆచార్య` రిలీజయ్యేందుకు ఆస్కారం ఉందనేది ఆ గుసగుసల సారాంశం. కోవిడ్ వల్ల ఇప్పటికే చిత్రీకరణ వాయిదా పడింది. దానికి తోడు ఇప్పటి వరకు తీసిన సన్నివేశాల్లో కొన్ని రీషూట్స్ చేయాల్సిందేనని కొరటాల ఫుటేజ్ చూశాక నిర్ణయించుకున్నారట. అయితే కొనసాగుతున్న కోవిడ్ లాక్ డౌన్ తదితర విషమ పరిస్థితుల వల్ల ఈ సినిమా షూటింగ్ ఇంకా పెండింగ్ పడే అవకాశం ఉంది. దానికి రీషూట్ల భారం అదనం.
అందువల్ల విడుదల తేదీ కూడా మారుతుందని ఊహాగానాలు సాగుతున్నాయి. ఇలాంటి రకరకాల కారణాలతో చిరుని కొరటాల రెండు నెలలు టైమ్ అడిగారని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే.. ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ కి సరిగ్గా పాతిక రోజుల ముందు ఆచార్య రిలీజయ్యేందుకు ఆస్కారం ఉంటుందన్నమాట. ఆచార్యలో చరణ్ 20 నిమిషాల నిడివి ఉన్న కీలక పాత్రను పోషిస్తున్నారు. చెర్రీకి నెల గ్యాప్ లో రెండు రిలీజ్ లకు ఆస్కారం ఉంటుందని దీనిని బట్టి కన్ఫామ్ చేయొచ్చు. అప్పటికి కూడా కరోనా క్రైసిస్ పూర్తిగా తొలగిపోయి థియేటర్లలో వందశాతం ఆక్యుపెన్సీ కండీషన్ రావాల్సి ఉంటుంది.