బొగ్గు గనుల్లోకి ‘ఆచార్య’.. పర్మిషన్ కంపల్సరీ.. మంత్రి అజయ్ ఏమన్నారంటే..?
మెగాస్టార్ చిరంజీవి - కొరటాల కాంబోలో తెరకెక్కుతున్న మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే రిలీజ్ డేట్ లాక్ చేయడంతో.. త్వరగా షూట్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలనే ప్లానింగ్ లో ఉంది యూనిట్. చిత్రీకరణ కూడా చివరి దశకు చేరుకుంది. అయితే.. కీలకమైన కొన్ని సీన్లు బ్యాలెన్స్ ఉన్నాయి.
వీటిని షూట్ చేసేందుకు నెక్స్ట్ షెడ్యూల్ ను ప్లాన్ చేశాడు దర్శకుడు. ‘ఆచార్య’ నెక్స్ట్ షెడ్యూల్ ను కోల్ మైన్స్ లో డిసైడ్ చేశాడు కొరటాల. ఇందులో చిరంజీవి - రామ్ చరణ్ మధ్య కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారు. దీంతో.. బొగ్గు గనుల పుట్టినిల్లైన ఇల్లెందును సెలక్ట్ చేశాడు కొరటాల. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న ఈ కోల్ మైన్స్ లో షూటింగ్ చేసేందుకు సిద్ధమైన దర్శకుడు.. ప్రభుత్వ అనుమతల కోసం మంత్రిని కలిశాడు.
ఇల్లెందు గనులు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉండడంతో.. జిల్లా మంత్రి అయిన పువ్వాడ అజయ్ ను కలిశారు కొరటాల. ఈ సందర్భంగా తమ రిక్వైర్ మెంట్ ను మంత్రికి వివరించాడు దర్శకుడు. దీనిపై మినిస్టర్ అజయ్ సానుకూలంగా స్పందించారు.
‘ఆచార్య’ చిత్ర బృందానికి నిర్ణీత సమయంలోనే పర్మిట్లు లభిస్తాయని హామీ ఇచ్చిన మంత్రి అజయ్.. మరొక అడుగు ముందుకు వేసి, మెగాస్టార్ చిరంజీవికి వసతి కల్పిస్తానని చెప్పారు. మంత్రి స్పందనతో డైరెక్టర్ కొరటాల చాలా సంతోషించి కృతజ్ఞతలు తెలిపారు. కాగా.. ఈ మధ్యనే మంత్రి అజయ్ ఆచార్య సెట్ కు వెళ్లి.. చిరుతో ఫొటో దిగిన విషయం తెలిసిందే.
ఈ షెడ్యూల్ మార్చి 7 నుండి మార్చి 15 వరకు కొనసాగనుంది. మ్యాటినీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మే 13న రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.