మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో `ఆచార్య` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చిత్రీకరణ పూర్తిచేసుకున్న సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. అన్ని పనులు పూర్తిచేసి ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమ్ న్యూ ఇయర్ కానుకగా ఇప్పటికే కొత్త పోస్టర్లు...టీజర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. వీటిపై సినిమాపై అంచనాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. చిరంజీవి ఆచార్య పాత్ర పీక్స్ లో ఉంటుందని టీజర్ లోనే తెలిసిపోతుంది. కొరటాల మార్క్ సెన్నిబిలిటీస్ తో సినిమా ఆద్యంతం ఆకట్టుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
తాజాగా ఈ సినిమా యూనిట్ సాంగ్ ప్రోమో రిలీజ్ చేసింది. `సానా కష్టం వచ్చిందే మందాకిని.. చూసే వాళ్ల కళ్లు కాకులు ఎత్తుకుపోనీ.. నడుము మడతలోనా జనం నలిగేపోనీ` అంటూ సాగే పాటలో మెగాస్టార్ వింటేజ్ స్టెప్పులు సంథింగ్ స్పెషల్ అని ఒప్పుకోవాల్సిందే. 66 ఏళ్ల వయసులో మెగాస్టార్ డాన్సు పరంగా తనదైన మార్క్ వేసారు. ఇందులో చిరంజీవి తో తెరను పంచుకున్న రెజీనా డాన్సు కూడా ఆకట్టుకుంటుంది. రెజీనా అందాల ఆరబోత పాటలో సమ్ థింగ్ స్పెషల్ గా హైలైట్ అవ్వడం ఖాయం. ఈ పాటకి శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసారు. మణిశర్మ సంగీతం శ్రోతల్ని అలరిస్తోంది. పూర్తి సాంగ్ జనవరి 3న సాయంత్రం 4.5 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
ఇక మెగాస్టార్-మణిశర్మ కాంబినేషన్ అంటే చెప్పాల్సిన పనిలేదు. క్లాస్.. మాస్ బీట్స్ తో అలరించడం ఖాయం. ఇలాంటి సింగిల్స్ ఆచార్య నుంచి మరిన్ని ఎక్స్ పెక్ట్ చేయొచ్చు. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. చరణ్ పైనా సాంగ్ షూట్ జరిగింది. మరి ఇందులో చరణ్ పాత్ర ఎలా ఉంటుందన్నది చూడాలి. చిరంజీవి నటించిన సినిమా రెండేళ్ల తర్వాత రిలీజ్ అవుతుంది. ఆయన చివరిగా `సైరా నరసింహారెడ్డి`గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.
Full View