మెగా స్టార్ సినిమా అంటే అంచనాలు ఎప్పుడూ ఆకాశంలోనే ఉంటాయి. ఇక, భారమంతా దర్శకుడు, మ్యూజిక్ డైరెక్టర్ దే అన్నట్టుగా ఉంటుంది పరిస్థితి. అయితే.. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ మెగాఫోన్ పట్టడంతో ఫ్యాన్స్ ఎక్స్ పెక్టేషన్స్ ఎక్కడికో వెళ్లిపోయాయి. ఇక, మెలోడీ బ్రహ్మ మణిశర్మ మ్యూజిక్ అని ప్రకటించడంతో.. అందరూ అలనాటి రోజులను గుర్తు చేసుకున్నారు.
చూడాలని ఉంది, మృగరాజు, ఇంద్ర, స్టాలిన్, జై చిరంజీవ.. ఇలా ఎన్నో మెగాస్టార్ సినిమాలకు అద్భుతమైన ఆల్బమ్స్ అందించారు మణిశర్మ. ఆచార్య ఆల్బమ్ కూడా ఆ స్థాయిలో రావాలని ఆశించారు ఫ్యాన్స్. అయితే.. కొంత కాలంగా మణిశర్మ లైమ్ లైట్ కూ దూరంగా ఉండడంతో ఎక్కడో చిన్న సందేహాలు కూడా ఉన్నాయి కొందరిలో.
అయితే.. ఆ అనుమానాలను పటా పంచలు చేసింది ఆచార్య ఫస్ట్ సింగిల్. 'లాహే లాహే.. ' అంటూ వచ్చిన సాంగ్ హ్యూజ్ రెస్పాన్స్ క్యాచ్ చేస్తుండడంతో.. ఫ్యాన్స్ దిల్ ఖుష్ అవుతున్నారు. ఇక, ఆల్బమ్ మొత్తం సూపర్ హిట్ అయినట్టే అనే నమ్మకానికి వచ్చేశారు. మిగిలిన సాంగ్స్ కోసం వెయిట్ చేస్తున్నారు.
మే 13న సినిమా రిలీజ్ కానుంది. దీనికి మధ్యలో చాలా టైమ్ ఉంది. ఈ గ్యాప్ లో ఒక్కో సింగిల్ ను వదులుతూ అభిమానులతో చిందేయించబోతున్నాడు మెలోడీ బ్రహ్మ. మిగిలిన పాటలు కూడా అంచనాలకు తగ్గకుండా ఉంటాయని, వాటికి మెగాస్టార్ వేసే స్టెప్పులకు థియేటర్ ఊగిపోవడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.