ముద్దు సన్నివేశంలో నటించడం అంటే సల్మాన్ కి పరమ చిరాకు! అన్నది తెలిసిందే. అది చిరాకో పరాకో కాదు. ఆయనకంటూ ఒక నియమం నిబంధన ఉన్నాయి. తన నియమం గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో సల్మాన్ మాట్లాడారు.
తెరపై ముద్దు సన్నివేశాలను తన తల్లి కూడా చూడటం తనకు నచ్చదని అందుకే ముద్దుకు నో చెబుతానని సల్మాన్ అన్నారు. తెరపై ముద్దు సన్నివేశం అర్థం లేనిది. రియల్ లైఫ్ లో దానిని ఆస్వాధించండి అని కూడా అన్నారు. అలాంటి సన్నివేశంలో చేయడం తనకు సౌకర్యంగా ఉండదని కూడా సల్మాన్ అన్నారు. నేను నా సినిమాల్లో ముద్దు సన్నివేశాలు ఎప్పుడూ చేయలేదు అని అన్నారు.
ఇక సల్మాన్ భాయ్ ని పెళ్లి గురించి ప్రశ్నిస్తే .. తన వ్యక్తిగత జీవితంపై పదే పదే ప్రశ్నలు విసిగిస్తాయని కూడా అన్నారు. సల్మాన్ నటించిన రాధే చిత్రం ఓటీటీ సహా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమాలో దిశా పటానీతో భాయ్ ముద్దు సన్నివేశంలో నటించారు. అయితే దిశా నోటికి ప్లాస్టర్ వేశాక మాత్రమే ముద్దు పెట్టినట్టు నటించారు. ఆ ఫోటోలు అంతర్జాలంలో వైరల్ అయ్యాయి.