మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా డిస్కో రాజా ఆన్ సెట్స్ ఉన్న సంగతి తెలిసిందే. వీఐ ఆనంద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్‌ఆర్‌టి ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై `చుట్టాలబ్బాయి` ఫేం రామ్ తళ్ళూరి ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. డిసెంబర్ 20న సినిమా విడుదల కానుంది. ఇటీవల గోవా షెడ్యూల్‌ను పూర్తయింది. అక్కడ 15 రోజుల పాటు కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.
తదుపరి 17 నుంచి యూరప్ వెళుతున్నామని నిర్మాత ప్రకటించారు. అక్కడ ఐస్ ల్యాండ్ లో అదిరిపోయే ఫైట్ సీన్ తీయబోతున్నారు. హాలీవుడ్ మూవీ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 7కి ఫైట్స్ కొరియోగ్రాఫ్ చేసిన స్టంట్ మాస్టర్ ఈ చిత్రానికి పని చేయనున్నారు. ఇందులో నెవ్వర్ బిఫోర్ అనదగ్గ హై ఆక్టేన్ యాక్షన్ సీన్ ఉంటుంది. 4 నిమిషాల పాటు సాగే ఈ సీన్ కోసమే 4-5 కోట్ల మేర బడ్జెట్ ని ఖర్చు చేశారని తెలుస్తోంది. మంచు కొండలు వగైరా అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ ఇదని తెలుస్తోంది.
బడ్జెట్ విషయంలో ఎక్కడా వెనుకాడకుండా క్వాలిటీతో తెరకెక్కిస్తున్నామని నిర్మాత చెబుతున్నారు. తాజా వివరాల్ని బట్టి రవితజ ఈసారి ష్యూర్ షాట్ హిట్ కొట్టడమే ధ్యేయంగా శ్రమిస్తున్నారని అర్థమవుతోంది. బడ్జెట్ల పరంగానూ రాజీకి రావడం లేదు. దర్శకహీరోలతో పాటు నిర్మాతకు ఇదో ఛాలెంజింగ్ ప్రాజెక్ట్ అని అర్థమవుతోంది.