తమిళనాట అజిత్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పని లేదు. ఆయనకి అక్కడ మాస్ ఆడియన్స్ లో ఎంత క్రేజ్ ఉందో .. అంతే స్థాయిలో ఫ్యామిలీ ఆడియన్స్ ఆదరణ కూడా ఉంది. అందరూ కూడా ఆయనను ఎంతగానో అభిమానిస్తుంటారు .. ఆరాధిస్తుంటారు.
అజిత్ మాత్రం చాలా సింపుల్ గా తనపని తాను చేసుకుంటూ వెళుతుంటాడు. ఎవరి విషయంలోను .. ఏ విషయంలోను ఆయన జోక్యం చేసుకోడు. తన పని తాను చేసుకుపోతుంటాడు. తన సినిమాల గురించి మాట్లాడడు .. ఇతరుల సినిమాల వేదికలపై కనిపించడు.
ఇక ఇండస్ట్రీలో తాను భాగమే అయినప్పటికీ వివాదస్పద విషయాలపై ఆయన ఎప్పుడూ స్పందించడు. అలాగే బయట రాజాకీయ సంబంధమైన విషయాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేయడు. అలా అని చెప్పేసి తన గురించి మాత్రమే ఆలోచన చేసే వ్యక్తి కాదు.
ఎవరికి ఎలాంటి కష్టం వచ్చినా ఆయన వెంటనే స్పందిస్తూ ఉంటాడు. ప్రకృతి విలయాల సమయాల్లో ఆయన అందించే సహాయ సహకారాలు ఆయన పెద్ద మనసును చాటుతూ ఉంటాయి. ఇక ఇటు సెట్లోను .. అటు బయట కూడా ఆయన ఇంతవరకూ ఎవరినీ కసురుకున్న దాఖలాలు లేవు.
సెట్లో కూడా తనకి మరొకరు ఫ్యాన్ పట్టుకోవడం .. గొడుగు పట్టడం ఇష్టం ఉండదు. సింప్లిసిటీ విషయంలో రజనీ తరువాత స్థానంలో అజిత్ పేరే అక్కడ వినిపిస్తూ ఉంటుంది. ఆయన అక్కడ ఏ పార్టీకి మద్దతు ఇచ్చినా ఆ పార్టీకి వచ్చే రెస్పాన్స్ ఒక రేంజ్ లో ఉంటుంది. అందువలన అక్కడి రాజకీయ పార్టీలు ఆయనను ఎప్పటికప్పుడు రాజకీయాలలోకి దింపడానికి ప్రయత్నం చేస్తుంటాయి. అయితే ఆయన వాటికి అందకుండా తనపని తాను చేసుకుపోతుంటాడు. తన సినిమాల విషయాలపై మాత్రమే ఫోకస్ పెడుతుంటాడు.
ఒకసారి అజిత్ పట్టించుకోవడం లేదని చెప్పి కొంతమంది స్థానిక నేతలు ఆయన అభిమానులను రంగంలోకి దింపేసి ఆయన ఛరిష్మాను వాడుకుందామని చూశారు. అప్పుడు అజిత్ అక్కడి అభిమాన సంఘాలను రద్దు చేసేశాడు. ఎక్కడ ఎప్పుడు ఎవరు అడిగినా తాను ర్తాజకీయాలలోకి రాననే చెబుతూ వచ్చాడు.
అయినా తాజాగా ఒక వార్త సంస్థ అజిత్ రాజకీయాల్లోకి రానున్నడంటూ ఒక ట్వీట్ చేయడం చర్చనీయాంశమైంది. వెంటనే అజిత్ వ్యక్తిగత మేనేజర్ స్పందిస్తూ, అజిత్ కి రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనే లేదనీ .. ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేయవద్దంటూ ఒక క్లారిటీ ఇచ్చేశాడు.