చూడచక్కని జంటగా వారికి పేరు. ప్రేమించి పెళ్లి చేసుకున్న వారు తాజాగా విడిపోతున్నట్లు పెట్టిన పోస్టు ఇప్పుడు వైరల్ గా మారటమేకాదు.. అయ్యో.. అలా జరిగిందా? అన్న ప్రశ్నను వేస్తున్నారు. అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకొని.. ఇంత వేడుకగా పెళ్లి చేసుకోవటమా? అంటూ పలువురి నోళ్లల్లో నానిన ఆ జంట ఇప్పుడు విడిపోతున్నట్లు ప్రకటించిన వైనం షాకింగ్ గా మారింది.
ఇంతకీ ఆ జంట ఎవరో కాదు.. జిస్మ్ 2.. ఆయేషా చిత్రాల్లో నటించిన బాలీవుడ్ నటుడు అరుణోదయ్ సింగ్.. కెనడాకు చెందిన హోటలీయర్ లీ ఎల్టన్ గా చెప్పాలి. ఎల్టన్ కి గోవాలో ఒక రెస్టారెంట్ ఉంది. ఆ క్రమంలో అక్కడకు వెళ్లిన అరుణోదయ్ కు ఆమె పరిచయం అయ్యారు. వారిద్దరి స్నేహం ప్రేమగా మారటం.. వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు.
2016లో వారిద్దరి రాయల్ మ్యారేజ్ జరిగింది. వారి పెళ్లి హడావుడి అప్పట్లో అందరి దృష్టిని ఆకర్షించింది. భోపాల్ లో హిందూ సంప్రదాయం ప్రకారం జరిగిన వీరి వివాహం మీడియాలో ప్రముఖంగా ఫోకస్ అయ్యింది. అలాంటి వారు ఇంత తక్కువ వ్యవధిలో విడిపోవటమా? అన్నది ప్రశ్నగా మారింది.
తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో తాము విడిపోతున్న విషయాన్ని అరుణోదయ్ తెలిపారు. ఇలాంటి విషాదకరమైన మెసేజ్ పోస్ట్ చేస్తానని తాను అనుకోలేదని.. తమ వివాహ బంధం ముగిసినట్లు పేర్కొన్నారు. ప్రేమించుకున్నప్పుడు తాము చాలా సంతోషంగా ఉన్నామని.. వివాహం తర్వాత అంతే ఆనందంగా ముందుకు సాగలేకపోతున్నట్లు పేర్కొన్నారు. తమ బంధాన్ని నిలుపుకోవటానికి చాలానే ప్రయత్నాలు చేసినా ఫలించలేదన్నారు.
తాము కొంతకాలం దూరంగా ఉన్నామని.. కౌన్సిలింగ్ తీసుకున్నామని.. ఎన్ని చేసినా తమ బంధాన్ని పునరుద్ధరించుకోలేకపోయినట్లు వెల్లడించారు. దీంతో. తామిద్దరం విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. విడిపోవటమే తెలివైన పని.. మా ఇద్దరికి ఇదే మంచిది.. దీన్ని మేం హుందాగా.. గౌరవంగా పరిష్కరించుకోవాలని ప్రయత్నిస్తున్నామని అరుణోదయ్ పేర్కొన్నారు. చూడచక్కని సెలబ్రిటీ జంట ఇంత స్వల్ప వ్యవధిలో విడిపోవటం పలువురికి షాకింగ్ గా మారింది.