మూవీ హిట్ కన్ఫర్మ్.. బూతులు అందుకే వాడాం: సిద్ధు
సినిమాలో యాక్షన్, థ్రిల్లింగ్, కామెడీ, లవ్ స్టోరీ అన్నీ ఉంటాయని తెలిపారు సిద్ధు. స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తుందని చెప్పారు.;

టాలీవుడ్ స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ తనకంటూ స్పెషల్ ఇమేజ్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. టిల్లు స్క్వేర్ తో గత ఏడాది మంచి హిట్ అందుకున్న సిద్ధు.. ఇప్పుడు జాక్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ఆ సినిమా.. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 10వ తేదీన రిలీజ్ కానుంది.
అయితే ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకున్న మూవీ ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అయింది. ఆ సందర్భంగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మీడియాతో మాట్లాడారు సిద్ధు మాట్లాడారు. ఆ సమయంలో పలు క్వశ్చన్స్ కు ఆన్సర్ ఇచ్చారు. జాక్ పూర్తిగా భాస్కర్ గారి ఆలోచన అని తెలిపారు. ఆయన సిగ్నేచర్ స్టైల్ మూవీ అని చెప్పారు.
సినిమాలో యాక్షన్, థ్రిల్లింగ్, కామెడీ, లవ్ స్టోరీ అన్నీ ఉంటాయని తెలిపారు సిద్ధు. స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తుందని చెప్పారు. మూవీ సూపర్ హిట్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. టిల్లును ఆదరించినట్లే జాక్ ను కూడా ఆదరిస్తారనే తనకు నమ్మకం ఉందని తెలిపారు. తన శైలిలో చాలా డైలాగులు చెప్పానని అన్నారు.
అయితే టిల్లుని మర్చిపోతారని చెప్పలేను, కానీ జాక్ మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతాడని అంచనాలు పెంచారు. సినిమాలోని కొన్ని సీన్స్ ఏకంగా హాలీవుడ్ రేంజ్ లో ఉంటాయని తెలిపారు. ఆ తర్వాత మూవీతో పాటు ట్రైలర్ లో కొన్ని బూతు పదాలు వాడటంపై రెస్పాండ్ అయ్యారు సిద్ధు జొన్నలగడ్డ.
అక్కడ ఆయా సీన్స్ కు అవసరం కాబట్టి బూతులు వాడామని సిద్దు తెలిపారు. హీరో క్యారెక్టర్ కు బాగా కోపం వచ్చే సీన్స్ లో బూతులు ఉపయోగించామని చెప్పారు. పీక్ క్లైమాక్స్ కావడంతో అక్కడ సీన్ కు సెట్ అయినట్లు యూజ్ చేశామని పేర్కొన్నారు. అయితే మూవీ సెన్సార్ ఇంకా కంప్లీట్ అయిందో లేదో తెలియదని అన్నారు.
ఇక సినిమా విషయానికొస్తే.. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్, బాపినీడు గ్రాండ్ గా నిర్మించారు. బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించారు. ప్రస్తుతం మేకర్స్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. త్వరలో మరిన్ని కార్యక్రమాలు చేపట్టనున్నారు. మరో వారం రోజుల్లో వరల్డ్ వైడ్ గా థియేటర్లలో సందడి చేయనున్నారు. మరి జాక్ తో సిద్ధు ఎలాంటి హిట్ అందుకుంటారో వేచి చూడాలి.