'పాము హీరోగా ఫణి మూవీ.. అందరికీ థ్రిల్ ఫీల్ పక్కా'
ప్రేక్షకులు నచ్చేలా ఆకర్షణీయమైన కంటెంట్ తో సినిమాను డైరెక్టర్ తెరకెక్కించగా.. AU&I సమర్పణలో ఓఎంజీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై డాక్టర్ మీనాక్షి అనిపిండి నిర్మించారు.;

టాలీవుడ్ డైరెక్టర్ వీఆన్ ఆదిత్యకు మంచి గుర్తింపు ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే అనేక సక్సెస్ ఫుల్ మూవీలు అందించిన ఆయన.. ఇప్పుడు ఫణితో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. హీరోయిన్ కేథరిన్ ట్రెసా లీడ్ రోల్ పోషించగా.. మహేష్ శ్రీరామ్, నేహా కృష్ణ, తనికెళ్ళ భరణి, కాశీ విశ్వనాథ్, రంజిత, యోగిత ఇతర పాత్రల్లో నటించారు.
ప్రేక్షకులు నచ్చేలా ఆకర్షణీయమైన కంటెంట్ తో సినిమాను డైరెక్టర్ తెరకెక్కించగా.. AU&I సమర్పణలో ఓఎంజీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై డాక్టర్ మీనాక్షి అనిపిండి నిర్మించారు. రీసెంట్ గా హైదరాబాద్ లో జరిగిన ప్రెస్ మీట్ లో మేకర్స్ మోషన్ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఆ సమయంలో ఆదిత్య గారు విభిన్న శైలితో ప్రయోగాలు చేయడంలో ప్రసిద్ధి చెందారని కేథరిన్ తెలిపారు.
ఫణి మూవీ తన కెరీర్ లో ఒక డైమండ్ గా నిలుస్తుందని చెప్పారు. ప్రేక్షకులకు థ్రిల్లింగ్ తో పాటు ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్స్ ను సినిమా అందిస్తుందని తెలిపారు. ఆ తర్వాత డైరెక్టర్ ఆదిత్య మాట్లాడారు. తాను ఎప్పుడు అమెరికా వెళ్లినా.. తన సోదరి మీనాక్షి ఇంట్లోనే ఉంటానని చెప్పారు. ఆ తర్వాత మిగతా ప్రాంతాలకు వెళ్తానని వెల్లడించారు.
అయితే తన సోదరితోపాటు బావ మనసులో సినిమా తీయాలని ఆలోచన ఎప్పుడూ రాలేదని తెలిపారు. కానీ రీసెంట్ గా మూవీని నిర్మించాలని అనుకుంటున్నట్లు తనకు చెప్పారని పేర్కొన్నారు. అప్పుడు భయమేసిందని, ఎందుకంటే నిర్మాతగా మారాలనుకునేవారు ముందే అన్ని నిర్ణయించుకుని ఇండస్ట్రీలోకి వస్తారని అన్నారు. కానీ తన సోదరి, బావ రంగంలోకి దిగి అన్ని సన్నాహాలు చేసుకున్నారని చెప్పారు.
ఫణి ఒక చిన్న చిత్రంగా ప్రారంభమైందని, కేథరీన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక మరో స్థాయికి వెళ్లిందని ఆదిత్య తెలిపారు. అలా పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ గా మారిందని వివరించారు. కేథరీన్ అంకిత భావాన్ని ఆయన ప్రశంసించారు. వర్క్ షాప్ లో సంతకం చేసినప్పటి నుండి ఆమె చురుకైన ప్రమేయాన్ని హైలైట్ చేశారు. మహేష్ శ్రీరామ్ సహకారాన్ని కూడా ఆయన గుర్తించారు.
సినిమా అంతా డల్లాస్ లో షూట్ చేశామని, పూర్తిగా అమెరికాలో చిత్రీకరించిన మొదటి భారతీయ చిత్రంగా నిలిచిందని తెలిపారు. మూవీలో పాము కీలక పాత్ర పోషిస్తుందని, కానీ కేథరీన్ కు పాములంటే భయమని తెలిపారు. కానీ ఆమె ఈజీగా నటించిందని అన్నారు. మూవీ కోసం ఐదు రోజుల పాటు వివిధ పాములను ఆడిషన్ చేసి, మూడు కెమెరాలతో ప్రతి క్షణాన్ని షూట్ చేశామని చెప్పారు. చివరికి బ్లాక్ పైన్ ను సినిమా హీరోగా ఎంచుకున్నట్లు పేర్కొన్నారు.