వరుణ్ తేజ్ హీరోగా రూపొందిన మిస్టర్ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిన్న హైద్రాబాద్ లో అంగరంగ వైభవంగా జరిగింది. మెగాస్టార్ చిరంజీవి ఈ వేడుకకు హాజరు కావడంతో.. ప్రత్యేక సందడి వచ్చేసింది. ఈ సందర్భంగా చాలామంది మాట్లాడారు కానీ.. కేరక్టర్ ఆర్టిస్ట్ బెనర్జీ మాటలు మాత్రం చాలామందిని ఆలోచింపచేశాయి.
'మొదటగా మెగాభిమానులకు అందరికీ అభినందనలు. చిరంజీవి గారి ఎదురుగుండా మాట్లాడడం నాకు ఇదే మొదటి సారి. ఆయన బిగినింగ్ డేస్ నుంచి చూశాను. తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాదు.. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే.. ఒక మనిషి ఏమీ లేని స్థాయి నుంచి ఎక్కడి నుంచో వచ్చి.. ఈ స్థాయికి ఎదగడం ఆయనకే సాధ్యమైంది. చాలామంది యాక్టర్లు కష్టపడి పైకి రావచ్చు కానీ.. ఆయన అందుకు స్థాయి.. లెవెల్.. హైట్.. మెగాస్టార్ లెవెల్ కి చేరుకోవడం ఎవరికీ సాధ్యం కాలేదు. ఈ విషయం చెబుదామని 25 ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్నాను. ఏమీ లేని స్థాయి నుంచి మెగాస్టార్ గా ఎదిగినది ఆయన ఒక్కరే' అన్నాడు బెనర్జీ.
'ఈ సమయంలో ఆయన కష్టపడినది.. బాధపడినది.. నవ్వుకున్నది.. నాకు చాలా విషయాలు తెలుసు. ఇవన్నీ దాటుకుంటూ మెగాస్టార్ లెవెల్ కు వచ్చారు. హ్యాట్సాఫ్ టు హిం. ఆయన్ను ఒక ఐకాన్ గా తీసుకుని.. ఆయన్ను ఫాలో అయిన వారు సినిమా ఇండస్ట్రీలో చాలామంది ఉంటారు. నేను ఇంకో విషయం చెప్పాలను అనుకుంటున్నాను. నాకు వచ్చిన ఆలోచన ఇది. ఆయన లైఫ్ హిస్టరీ సినిమాగా తీస్తే ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తుంది. ఇప్పుడొచ్చిన ఇండస్ట్రీలోని రైటర్స్ కు కొన్ని విషయాలు తెలియకపోవచ్చు. కానీ ఆయన చెబుతారు. ఇండస్ట్రీలోకి వచ్చిన రోజు నుంచి ఇప్పటివరకూ ఆయన జీవిత చరిత్రను సినిమాగా తీస్తే.. కమర్షియల్.. ఎమోషనల్.. సెంటిమెంటల్ అన్నీ ఉంటాయందులో' అన్నాడు బెనర్జీ.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/