సోషల్ మీడియా విస్తృతం అయ్యాక.. ఇండస్ట్రీ గురించి రూమర్స్ ఎక్కువైపోయాయి. అదే సమయంలో ఇదే సోషల్ మీడియా ద్వారా తమ భావాలను వ్యక్తం చేసే అవకాశం కేరక్టర్ ఆర్టిస్టులకు దక్కుతోంది. సినిమా ఫంక్షన్లలో మాట్లాడలేని.. అడగలేని విషయాలను ఇంటర్వ్యూలలో అడిగేస్తున్నారు.. కడిగేస్తున్నారు. తాజాగా తెలుగు నటి హేమ ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో చాలా అంశాలపై హేమ సీరియస్ గా నిలదీసింది.
'పూరీ జగన్నాధ్ ఎక్కడెక్కడ ఉన్నోళ్లనో తెచ్చి.. ఏదో చేస్తాడు. ఇక్కడున్నోళ్లను పట్టించుకోడు.. నాకెందుకు మదర్ కేరక్టర్స్ ఇవ్వడు. ఎన్టీఆర్ కి మదర్ గా చేసేందుకు.. హేమకు ఓ స్టేచర్ లేదా' అనేసింది. 'కొంతమంది తప్పు చేసి సినిమాలు చేస్తున్నారంటే.. వాళ్ల పరిస్థితులు ఏంటో అర్ధం చేసుకోవాలి. హేమకు బలుపు.. పొగరు అని వాళ్లు పక్కన పెడతారు. ఒక్క హీరో.. డైరెక్టర్ కూడా ఆలోచించలేదు. నాకు ఇండస్టీలో 25 ఏళ్ల అనుభవం ఉంది. చెప్పగల అర్హత.. హక్కు కూడా ఉన్నాయి. ఇండస్ట్రీ చెడ్డదనే మాట వినిపిస్తూ ఉంటుంది. హీరోలు.. హీరోయిన్లు.. ప్రొడ్యూసర్లు.. డైరెక్టర్లు.. ఇలా అందరూ తమ పిల్లలను తీసుకొస్తున్నారు. ఇండస్ట్రీ చెడ్డదైతే.. అందరూ తమ పిల్లలను ఎందుకు తీసుకొస్తారు' అని నిలదీసింది హేమ.
'చిరంజీవి టైమ్ నుంచి.. కాపులను తొక్కేస్తారనే టాక్ వింటూనే ఉన్నాను. కాపుగా పుట్టడమే నేరం అన్నట్లుగా చిత్రీకరిస్తున్నారు' అన్న హేమ.. తాజాగా ఇండస్ట్రీపై వస్తున్న కేస్టింగ్ కౌచ్ ఆరోపణలపై కూడా స్పందించిది. 'వాళ్లు గతంలో చేసిన సినిమాల పేర్లు చెప్పుకునే బతుకుతున్నారు. ఇప్పుడు వేషాలు రానంత మాత్రాన.. ఇన్నేళ్లు ఫుడ్ పెట్టి.. ఇంత గౌరవం ఇచ్చిన ఇండస్ట్రీపై ఆరోపణలు సరి కాదు' అంటోంది ఈ సీనియర్ నటి.
సో.. ఒకప్పుడు ఛాన్సులు వచ్చి ఇప్పుడు రావట్లేదంటే.. ఆ పాత సినిమాలనూ పరిస్థితులనూ బ్లేమ్ చేయడం భావ్యం కాదేమోలే!!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/