సినిమాని బిగ్ స్క్రీన్ లోనే చూడమని చెప్తున్న యంగ్ రెబల్ స్టార్..!

Update: 2020-12-23 16:51 GMT
కరోనా మహమ్మారి ప్రభావం వల్ల గత కొన్ని నెలలుగా ప్రేక్షకులు థియేటర్ ఎక్స్పీరియన్స్ కి దూరమయ్యారు. ప్రతి శుక్రవారం థియేటర్ లో రిలీజ్ అయ్యే కొత్త సినిమాల కోసం ఎదురు చూసే సినీ అభిమానులు.. ఇప్పుడు ఓటీటీలో హోమ్ స్క్రీన్ లో అందుబాటులో ఉన్న సినిమాలతో సరిపెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో 50 శాతం సీటింగ్ కెపాసిటీతో థియేటర్స్ మల్టీప్లెక్సెస్ తెరుచుకోడానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. దీంతో పలు రాష్ట్రాల్లో ఇప్పుడిప్పుడే థియేటర్స్ రీ ఓపెన్ అవుతున్నాయి. ఇక హైదరాబాద్ లో అన్ని చోట్ల దాదాపుగా మల్టీప్లెక్స్ లు రీ ఓపెన్ చేశారు. ప్రసాద్ ఐమాక్స్ - AMB సినిమాస్ వంటి స్క్రీన్స్ చాలా గ్యాప్ తర్వాత ఓపెన్ చేసి సినిమాలు ప్రదర్శిస్తుండటంతో సెలబ్రిటీలు తమ వంతు బాధ్యతగా థియేటర్ లో సినిమాలు చూడమని చెప్తూ ప్రమోషన్స్ చేస్తున్నారు. తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా థియేటర్స్ కోసం ప్రచారం చేస్తున్నాడు.

ప్రభాస్ సోషల్ మీడియా మధ్యమాలలో ఓ వీడియో పోస్ట్ చేస్తూ సినిమాలను థియేటర్స్ లో చూడమని కోరుతున్నాడు. 'మన సినిమాని బిగ్ స్క్రీన్ లో ఎక్స్పీరియన్స్ చేద్దాం' అని ప్రభాస్ చెబుతున్నాడు. మన థియేటర్స్ సేఫ్టీ మేజర్స్ తో మళ్ళీ ఎక్సపీరియన్స్ ఇవ్వడానికి ముందుకు వచ్చాయని.. మాస్క్ ధరించి సేఫ్ గా ఉండమని ప్రభాస్ సూచిస్తున్నాడు. ఇంతకముందు నాగచైతన్య - సాయి ధరమ్ తేజ్ - నిఖిల్ - విశ్వక్ సేన్ వంటి హీరోలు కూడా థియేటర్స్ ని సపోర్ట్ చేస్తూ వీడియోలు పెట్టారు. హాళ్ళలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని.. మళ్ళీ మనం థియేటర్ ఎక్స్పీరియన్స్ చేద్దామని.. సినిమాలు ఇకపై థియేటర్లోనే చూద్దాం అంటూ ప్రమోషన్ చేశారు. ఇప్పుడు కొన్ని పెద్ద సినిమాలు థియేట్రికల్ రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. ప్రభుత్వం నిబంధనల ప్రకారం 50 శాతం టికెట్లు మాత్రమే అమ్మాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సినిమాలకు ప్రేక్షకులను నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.Full View
Tags:    

Similar News