బాలీవుడ్‌లో ఎవ‌రి వ‌ల్లా కాదు.. RGV పంచ్‌లు

అయితే పుష్ప లాంటి సినిమాని బాలీవుడ్ లో ఎవ‌రూ తీయ‌లేర‌ని ఆర్జీవీ అన్నారు.

Update: 2025-02-12 12:20 GMT

''పుష్ప- 1 చూసినప్పుడు, నాకు తెలిసిన ఒక వ్య‌క్తి 'ఉత్తరాది ప్రేక్షకులు ఈ వ్యక్తి ముఖంపై వాంతులు చేసుకుంటారు'' అని కామెంట్ చేసిన‌ట్టు ఆర్జీవీ తెలిపారు. 'పుష్ప: ది రైజ్' గురించి ఒక ప్రముఖ హిందీ ఫిలింమేక‌ర్ చేసిన దారుణమైన వ్యాఖ్యలను ఆర్జీవీ తాజా ఇంట‌ర్వ్యూలో గుర్తు చేసుకున్నారు. అయితే పుష్ప లాంటి సినిమాని బాలీవుడ్ లో ఎవ‌రూ తీయ‌లేర‌ని ఆర్జీవీ అన్నారు. అయితే ఉత్త‌రాది ఫిలింమేక‌ర్ వ్యాఖ్య‌ల‌ను గుర్తు చేస్తూ... నిజానికి ప్ర‌జాద‌ర‌ణ అనేది రిచ్ లుక్ లేదా స్మార్ట్ లుక్ కి సంబంధించిన‌ది కాద‌ని, అది పాత్రతో సంబంధం కలిగి ఉంటుంద‌ని ఆర్జీవీ పింక్‌విల్లా ఇంటర్వ్యూలో అన్నారు. తన హీరో 6 ప్యాక్ తో 'సూపర్ గుడ్-లుకింగ్' అయి ఉండాల‌ని స‌ద‌రు నిర్మాత కోరుకున్నాడ‌ని ఆర్జీవీ వెల్ల‌డించారు.

అయితే పుష్ప- 1, పుష్ప - 2 ఫ‌లితం చూశాక అతడికి ఇప్పుడు పీడకలలు వస్తున్నాయి. స‌ద‌రు హిందీ చిత్రనిర్మాత ఇలాంటివి ఎప్పటికీ తీయలేడని ఆర్జీవీ విమ‌ర్శించారు. ఎందుకంటే ఆ 6 ప్యాక్ హీరోయిక్ లుక్ లు కేవ‌లం బాంద్రాకే పరిమితమ‌ని అన్నారు. అలాగే ద‌క్షిణాది ద‌ర్శ‌కుల గొప్ప‌త‌నం గురించి కూడా ఆర్జీవీ ప్ర‌శంస‌లు కురిపించారు.

చాలా మంది దక్షిణాది దర్శకుల పేర్లు నేను చెప్పను.. వారికి ఇంగ్లీష్ కూడా రాదు. వీళ్లంతా చాలా ప్రాథమిక సూత్రాల‌ను అనుస‌రిస్తారు. ఇండ‌స్ట్రీలో చాలా పాతుకుపోయిన ప్ర‌ముఖులు.. ప్ర‌జ‌ల‌కు కనెక్ట్ అయ్యారు. వారు మేధోపరంగా మాట్లాడరు. వారు మాస్ ప్రేక్షకులతో ఎక్కువగా కనెక్ట్ అవుతారు.. ఇది బాలీవుడ్ దర్శకుల‌కు అసాధ్యం అని ఆర్జీవీ అన్నారు.

బాలీవుడ్‌లో 'సెన్సిబిలిటీ డిఫరెన్స్' ప్రేక్షకులతో సంబంధం క‌లిగి ఉండ‌దని, ఎందుకంటే ఇక్క‌డి జ‌నం మంచి కంటెంట్ ఎక్క‌డి నుంచి వ‌చ్చినా, ఏ పరిశ్రమ నుండి సినిమాలనైనా చూస్తారని అన్నారు. స్టార్లు ఎల్లప్పుడూ స్టార్లుగా నటించాలి.. వారు పాత్రలు పోషించకూడదు. వారు మారితే, ప్ర‌జ‌లు డిస్‌కనెక్ట్ అవుతారు. ప్ర‌జ‌లు మారినప్పటికీ, మీరు అదే భావోద్వేగానికి అనుగుణంగా మారాల్సి ఉంటుంద‌ని అన్నారు. బాలీవుడ్‌లో కథకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని, అయితే దక్షిణాదిలో దర్శకులు సన్నివేశాలను మాత్రమే చూస్తారని , కథ గురించి పెద్దగా పట్టించుకోరని కూడా ఆర్జీవీ అన్నారు. ఒక పెద్ద నటుడు ఒకసారి నాతో, నేను ఎప్పుడూ కథ వినను.. నా ఏకైక ప్రశ్న.. మేరా ఎంట్రీ క్యా హై? అని అన్నారని ఆర్జీవీ గుర్తు చేసుకున్నారు.

పుష్ప 2: ది రూల్ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 64 రోజుల‌లో మొత్తం రూ.1,742.1 కోట్లు వసూలు చేసింది. భార‌త‌దేశం నుంచి 1200 కోట్లు వ‌సూలు చేసింది.

Tags:    

Similar News