దబిడి దిబిడి ఇబ్బంది అనిపించలేదు..!

ఊర్వశి బ్యాక్‌ పై దబిడి దిబిడి అంటూ బాలకృష్ణ కొడుతున్నట్లు ఉన్న స్టెప్స్‌ను చాలా మంది విమర్శించారు.

Update: 2025-02-12 12:21 GMT

సంక్రాంతికి వచ్చిన 'డాకు మహారాజ్‌' సినిమా బాలకృష్ణకు మరో విజయాన్ని కట్టబెట్టింది. అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో హ్యాట్రిక్ సాధించిన బాలకృష్ణకు 'డాకు మహారాజ్‌' సినిమా డబుల్ హ్యాట్రిక్‌ను అందించింది. బాబీ దర్శకత్వంలో నాగవంశీ రూపొందిన ఈ సినిమా పాటలకు మంచి స్పందన దక్కింది. ముఖ్యంగా దబిడి దిబిడి సాంగ్‌కి పాజిటివ్ రెస్పాన్స్ దక్కింది. అదే సమయంలో పాటలోని డాన్స్‌ స్టెప్స్‌పై విమర్శలు వచ్చాయి. ఈ ప్రత్యేక సాంగ్‌లో బాలీవుడ్‌ స్టార్‌ నటి ఊర్వశి రౌతేలా కనిపించింది. ఊర్వశి బ్యాక్‌ పై దబిడి దిబిడి అంటూ బాలకృష్ణ కొడుతున్నట్లు ఉన్న స్టెప్స్‌ను చాలా మంది విమర్శించారు.

ఊర్వశి రౌతేలా బాలీవుడ్‌ బ్యూటీ కావడంతో జాతీయ మీడియాలోనూ ఈ విషయం గురించి ప్రస్తావన వచ్చింది. హిందీ సినిమా విమర్శకులు ఇవేం స్టెప్స్‌ అంటూ కాస్త ఘాటుగానే విమర్శలు చేశారు. ఇలాంటి స్టెప్స్‌కి ఊర్వశి రౌతేలా ఎలా ఒప్పుకుంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తే, సౌత్ సాంగ్స్‌ అంటే ఇలాగే ఉంటాయి అంటూ కొందరు తక్కువ చేసి విమర్శలు చేశారు. మొత్తానికి దబిడి దిబిడి సాంగ్‌కి వచ్చిన విమర్శలతో అత్యధిక వ్యూస్‌ సైతం దక్కాయి. శేఖర్ మాస్టర్‌ కొరియోగ్రఫీ అందించిన ఈ పాటపై వస్తున్న వివాదంపై ఊర్వశి రౌతేలా మరోసారి స్పందించింది. పాటలో తప్పు ఏమీ లేదని, కొందరు కావాలని దాన్ని పెద్దగా చేసి చూసే ప్రయత్నం చేస్తున్నారని ఊర్వశి అసహనం వ్యక్తం చేసింది.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఊర్వశి రౌతేలా మాట్లాడుతూ... దబిడి దిబిడి రిహార్సల్స్‌ చాలా సార్లు చేశాం. శేఖర్ మాస్టర్‌తో రిహార్సల్స్‌ చేస్తున్న సమయంలో తనకు ఏమీ ఇబ్బంది అనిపించలేదు. అసలు ఆ సమయంలో తాము ఇలాంటి ఒక వివాదం వస్తుందని ఊహించలేదు. వాటిని సాధారణ స్టెప్స్‌గానే భావించాము. కానీ పాట విడుదల అయ్యాక కొందరు చేసిన విమర్శలు చూసి షాక్ అయ్యాను. కొందరు సోషల్‌ మీడియాలో చేసిన కామెంట్స్‌ ఆశ్చర్యంగా అనిపించాయి. ఇక్కడ కొరియోగ్రఫీ తప్పు పట్టడానికి ఏమీ లేదు. ఈ విషయంలో కొరియోగ్రాఫర్‌ను నిందిస్తూ విమర్శించాల్సింది ఏమీ లేదు. ఈ పాట ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఎవరూ ఇలాంటి ఒక విమర్శ వస్తుందని ఊహించలేదని ఆమె అన్నారు.

సోషల్‌ మీడియాలో వినిపిస్తున్న విమర్శలను తాను పట్టించుకోను అంది. ఒక సినిమా సక్సెస్‌ అయినా ఫ్లాప్‌ అయినా కొందరు ప్రశంసిస్తారు, కొందరు విమర్శిస్తారు. కనుక తాను విమర్శలను పట్టించుకోను అంటూ క్లారిటీ ఇచ్చింది. సోషల్‌ మీడియాలో తన గురించి ఏమైనా విశ్లేషణతో కూడిన విమర్శలు చేస్తే అప్పుడు ఆలోచిస్తాను అంది. డాకు మహారాజ్ సినిమా సక్సెస్‌ కావడంతో బాలీవుడ్‌లోనూ తనకు మంచి ఆఫర్లు వస్తున్నాయని ఊర్వశి చెప్పుకొచ్చింది. తెలుగులో మరిన్ని సినిమాలు చేయడం కోసం వెయిట్ చేస్తున్నట్లు పేర్కొంది. ఎంతగా విమర్శలు వస్తున్నాయో అదే స్థాయిలో సోషల్‌ మీడియాలో దబిడి దిబిడి సాంగ్‌ పాపులర్ అవుతోంది. కాలేజ్ స్టూడెంట్స్ ఓ రేంజ్‌లో ఈ పాటకి డాన్స్ చేసిన వీడియోలో వైరల్‌ అవుతున్నాయి. సినిమా సక్సెస్‌లో దబిడి దిబిడి సాంగ్‌ కీలక పాత్ర పోషించింది. తమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు. తమన్ కుర్చీ మడత పెట్టి పాట తర్వాత ఆ స్థాయిలో ఈ పాటకు స్పందన వస్తుంది.

Tags:    

Similar News