సినిమాల్లోనే ఈయన విలన్‌ రియల్‌ లైఫ్‌ హీరో

Update: 2020-03-23 05:12 GMT
సౌత్‌ లో స్టార్‌ నటుడిగా.. విలక్షణ నటుడిగా మంచి పేరు దక్కించుకున్న ప్రముఖ నటుడు ప్రకాష్‌ రాజ్‌ పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. తన బాధ్యతగా ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని ఆ గ్రామానికి పూర్తి అభివృద్దికి నిధులు కేటాయించిన ప్రకాష్‌ రాజ్‌ ఆ తర్వాత పలు సేవా కార్యక్రమాలు నిర్వహించాడు. ప్రస్తుతం కరోనా మహమ్మారి జనాలను భయభ్రాంతులకు గురి చేస్తున్న ఈ సమయంలో ప్రకాష్‌ రాజ్‌ తనవంతు సాయంకు ముందుకు వచ్చారు.

స్వీయ నిర్భందంలో ఉండటం వల్లే కరోనాను అరికట్టవచ్చు అంటూ ప్రభుత్వాలు ప్రకటిస్తున్న నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో కూడా లాక్‌ డౌన్‌ కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ సంస్థలతో పాటు ప్రైవేట్‌ సంస్థలు కూడా తమ ఉద్యోగులకు సెలవులు ఇచ్చి వారికి జీతాలు కూడా ఇవ్వాలంటూ ప్రభుత్వాలు ఆదేశించిన నేపథ్యంలో ప్రకాష్‌ రాజ్‌ తన వద్ద పని చేసే వారికి తన ప్రొడక్షన్‌ హౌస్‌ లో డైలీ లేబర్‌ గా చేసే వారికి ముందస్తు జీతంను ఇచ్చేందుకు సిద్దం అయ్యాడు.

దేశ వ్యాప్తంగా కర్ఫ్యూ వాతావరణం ఉన్న నేపథ్యంలో తన బ్యాంక్‌ అకౌంట్‌ లో ఉన్న బ్యాలన్స్‌ చెక్‌ చేశాను. వెంటనే తన ఉద్యోగస్తులందరికి కూడా నెల జీతంను ముందస్తుగా ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చాను. తన సినిమాలకు వర్క్‌ చేసే డైలీ లేబర్‌ కు కూడా సగం వేతనంను ఇస్తానంటూ ప్రకటించాడు. ఇది నా బాధ్యతగా నేను చేస్తున్నాను. మీరు కూడా మీ ఉద్యోగస్తులకు బాసటగా నిలవండి అంటూ ప్రకాష్‌ రాజ్‌ సోషల్‌ మీడియా ద్వారా పిలుపునిచ్చాడు.

సోషల్‌ మీడియాలో ప్రకాష్‌ రాజ్‌ పై ప్రశంసల జల్లు కురుస్తోంది. సినిమాల్లో విలన్‌ గా కనిపించే ప్రకాష్‌ రాజ్‌ రియల్‌ లైఫ్‌ లో మాత్రం హీరో అనిపించుకుంటున్నారంటూ ఆయన అభిమానులు అభినందిస్తున్నారు.
Tags:    

Similar News