టాలీవుడ్ కు విషాదం.. సీనియర్ నటుడు కన్నుమూత

Update: 2021-10-25 04:02 GMT
టాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్టు.. తెర మీద గంభీరంగా ఉంటూ.. పాత్రలో ఇట్టే ఒదిగిపోయే 64 ఏళ్ల రాజబాబు ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. గడిచిన కొంతకాలంగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న ఆయన ఇక లేరు. ఆయనకు భార్య.. ముగ్గురు పిల్లలు. తెర మీద గంభీరంగా.. ఊరి పెద్దగా.. పెద్ద మనిషి పాత్రలు ఎన్నింటినో వేసిన ఆయన.. తెర వెనుక మాత్రం చాలా సరదా మనిషిగా చెబుతారు. అందరి నోట ‘బాబాయ్’ అనిపించుకునే ఆయన లేరనే మాట ఇప్పుడు షాకింగ్ గా మారింది. దీంతో.. టాలీవుడ్  ఇప్పుడు విషాదంలో మునిగిపోయిన పరిస్థితి.

రాజబాబు స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం మండలంలోని నరసాపురపేట. నటన మీద చిన్నతనం నుంచి పెంచుకున్న ఆసక్తి ఆయన్ను 1995లో ‘ఊరికి మెనగాడు’ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. సినిమాలకు ముందు నాటకాలు వేసేశారు. దేశమంతా తిరిగి ప్రదర్శనలు ఇచ్చేవారు.

ఓవైపు సినిమాలు.. మరో వైపు టీవీ సీరియల్స్ లోనూ ఆయన నటిస్తుంటారు. ఇప్పటివరకు ఆయన 48 సీరియల్స్ లో నటించారు. సింధూరం.. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే.. మురారీ.. శ్రీకారం.. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు.. కళ్యాణ వైభోగం.. భరత్ అనే నేను.. ఇలా పలు సినిమాల్లో నటించారు.

ఇప్పటివరకు 62 సినిమాల్లో నటించారు. సీరియల్స్ లో వసంత కోకిల.. అభిషేకం.. రాధా మధు.. మనసు మమత..ఇలా పలు సీరియల్స్ లోనూ నటించిన తన నటనతో అలరించారు. సెట్స్ లోనూ.. విడిగానూ సరదా మనిషిగా పేరున్న ఆయన.. అందరిని కలుపుకుపోయే తత్త్వం ఉందని చెబుతారు. అలాంటి ఆయన ఇక లేరన్న మాట జీర్ణించుకోలేనిదిగా మారిందని పరిశ్రమకు చెందిన పలువురు అభిప్రాయపడుతున్నారు.
Tags:    

Similar News