టాలీవుడ్ లో ప్రస్తుతం ట్రెండ్ మారింది. స్టార్ హీరోతో మాత్రమే సినిమాలు చేయాలని బిగ్ ప్రొడక్షన్ కంపనీలు ఎదురుచూడటం లేదు. స్టోరీ డిమాండ్ మేరకు చిన్న హీరోలతో కూడా సినిమాలు చేయడానికి రెడీ అయిపోతున్నారు. ఇలా చేసిన చిత్రాలు భారీ లాభాలని అందిస్తుండటంతో భారీ నిర్మాణ సంస్థలు చిన్న హీరోలతో సినిమాలు చేయడానికి పోటీపడుతున్నాయి. ఇటీవల `జాతిరత్నాలు` వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని అందించిన వైజయంతీ మూవీస్ ఇదే ఫార్ములాతో మరో చిన్న చిత్రాన్ని నిర్మించడానికి రెడీ అయిపోతోంది.
ఇందులో హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన స్టోరీ వర్క్ పూర్తయిందని, త్వరలోనే ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. రెగ్యులర్ షూటింగ్ కూడా త్వరలోనే ప్రారంభం అయ్యే అవకాశాలు వున్నాయని తెలిసింది.
ఇదిలా వుంటే ఈ మూవీతో పాటు మరో పాపులర్ బ్యానర్ లో సినిమా చేయబోతున్నాడు రోషన్. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో తన తదుపరి చిత్రాన్ని చేయబోతున్నాడు. దీనికి సంబంధించిన ఫైనల్ టాక్స్ పూర్తయ్యాయి. ఇది కూడా పెద్ద సంస్థనే కావడంతో రోషన్ ప్లాన్ మామూలుగా లేదని, వరుసగా భారీ నిర్మాణ సంస్థల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలని లైన్ లో పెట్టేశాడని అంతా అవాక్కవుతున్నారు.
రోషన్ `నిర్మలా కాన్వెంట్` చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. యితే ఇందులో కింగ్ నాగార్జున మెరిసినా పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. ఆ తరువాత `పెళ్లిసందD`తో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ప్రయత్నించాడు. సినిమాకు నెగెటివ్ ప్రచారం జరిగినా దసరా సీజన్ లో రిలీజ్ కావడం, హీరోయిన్ గ్లామర్, రోషన్ నటన, డ్యాన్సులు ఈ మూవీకి ప్లస్ గా మారి మంచి వసూళ్లని రాబట్టింది.
ఇది గమనించిన వైజయంతీ మూవీస్ ముందుగానే రోషన్ ని లాక్ చేసిందని, అడ్వాన్స్ కూడా ఇచ్చేసి సినిమా ఫైనల్ చేసిందని, ఆ తరువాత వెంటనే సితార ఎంటర్ టైన్ మెంట్స్ అధినేత కూడా రోషన్ తో సినిమాని ఫైనల్ చేసుకోవడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.