'ఐరన్ మ్యాన్' మళ్లొస్తున్నాడు.. మస్క్ రూపంలో?
ప్రతిష్ఠాత్మక ఎంసియులో భారీ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల డాలర్లు కొల్లగొడుతున్నాయి.
ప్రతిష్ఠాత్మక ఎంసియులో భారీ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల డాలర్లు కొల్లగొడుతున్నాయి. ఫ్రాంఛైజీ చిత్రాలకు ఉన్న గిరాకీ దృష్ట్యా ఎంసియు అసాధారణ కాన్సెప్టులను ఎంపిక చేసుకుని ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులను రంజింపజేస్తోంది. సూపర్ హీరోల యుగంలో ఐరన్ మ్యాన్ ఒక సంచలనం.
కానీ ఐరన్ మ్యాన్ ఫ్రాంఛైజీ ఇటీవల మనుగడలో లేకపోవడం .., ఇప్పటికే ముగింపు పలకడం నిజంగా అభిమానులను నిరాశపరిచింది. ఐరన్ మ్యాన్ గా టోనీ స్టార్క్ ప్రపంచవ్యాప్తంగా గొప్ప ఫాలోవర్స్ ని సంపాదించాడు. అతడిని ఆ పాత్రలో చూడాలని అభిమానులు ఎంతగానో వేచి చూసేవారు.
అయితే టోనీ తిరిగి వస్తాడో లేదో కానీ, అతడి స్నేహితుడు ఎలన్ మస్క్ ఇప్పుడు `ఐరనీ మ్యాన్`గా మారి ఆశ్చర్యపరిచారు. ఐరన్ మ్యాన్ లేని లోటును ఈ ఐరనీ మ్యాన్ తీరుస్తాడన్న బిల్డప్ బాగానే ఉంది కానీ, మస్క్ వెండితెర నటుడిగాను ప్రయోగం చేస్తాడా? అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.
మల్టీ బిలియనీర్ ఎలన్ మస్క్ నిజమైన ఐరన్ మ్యాన్ టోనీస్టార్క్ కి అత్యంత సన్నిహితుడు కావడం ఇక్కడ యాధృచ్ఛికం. చూస్తుంటే మస్క్ కోరికను నెరవేర్చేందుకు ఆస్కారం ఉందా? అన్న గుసగుస మొదలైంది. అయితే ఎలన్ మస్క్ ఐరనీ మ్యాన్ అవతారం చూడగానే ఇది చాలా ఫన్ ని జనరేట్ చేస్తోంది. టెస్లా, స్పేస్ ఎక్స్ అధినేత కామిక్ టైమింగ్ అందరినీ నవ్విస్తోంది. ఐరన్ మ్యాన్ దుస్తుల్లో అతడి పరకాయం బాగానే ఉంది కానీ, టోనీ దీనికి అంగీకరించాడా? అన్నది అతడినే ప్రశ్నించాఇ.
ఇటీవలే స్పేస్ ఎక్స్ ప్రాజెక్ట్ తో ప్రపంచ దేశాల మధ్య దూరాన్ని అమాంతం అర్థగంటకు తగ్గించేయాలనే కొత్త ప్రయత్నంలో ఉన్న మస్క్ ని చూస్తుంటే అతడు నిజంగానే ఐరనీ మ్యాన్ అని అంగీకరించి తీరాలి. భారతదేశం నుంచి అమెరికాకు లేదా బ్రిటన్ , ఐరాపా దేశాల నుంచి భారత్ కి కేవలం అర్థగంటలో ప్రయాణించే మార్గం ఏదైనా ఉందా? అని ఎలన్ మస్క్ ప్రయోగాలు చేస్తున్నాడు. మునుముందు విమానాలతో పని లేకుండా, రాకెట్ ద్వారా మనుషుల్ని గ్రహాల్ని దాటించే ప్రయత్నంలో ఉన్నాడు. ఓవైపు అంగారకుడిపైకి మానవాళిని చేర్చాలనే ప్రయత్నంతో పాటు, దూరం తగ్గించే రాకెట్ ప్రయోగాల్లో అతడు నిమగ్నమై ఉన్నాడు. ఇలాంటి సమయంలో ఐరనీ మ్యాన్ అంటూ ఇలా కామెడీ చేస్తూ పోస్టర్ ని రిలీజ్ చేసినా కానీ, అతడిని ఒక సూపర్ మేన్ గానే అభిమానులు ఆరాధిస్తున్నారు.