చనిపోయిన పర్లేదు.. అలా చేయకూడదు అనుకున్నా: సంజయ్ దత్

Update: 2023-01-13 23:30 GMT
బాలీవుడ్ లో స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకొని ప్రస్తుతం సౌత్ లో కూడా సినిమాలు చేస్తున్న నటుడు సంజయ్ దత్. కేజీఎఫ్ చాప్టర్ లో సంజయ్ దత్ పోషించిన అధీరా పాత్రకి సౌత్ ఆడియన్స్ భాగా కనెక్ట్ అయ్యారు. అతని పెర్ఫార్మెన్స్ కి ఫిదా అయ్యారు. ఈ సినిమా తర్వాత సౌత్ లో సంజయ్ దత్ కి మంచి అవకాశాలు వస్తున్నాయి. తెలుగులో కూడా అతన్ని విలన్ గా పరిచయం చేయడానికి టాలీవుడ్ దర్శకులు ప్రయత్నం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే సంజయ్ దత్ రెండేళ్ళ క్రితం క్యాన్సర్ బారిన పడిన సంగతి తెలిసిందే. ఈ క్యాన్సర్ కి ట్రీట్మెంట్ తీసుకొని పూర్తి ఆరోగ్యంతో సంజయ్ దత్ బయటపడ్డారు. అయితే క్యాన్సర్ బారిన పడిన సమయంలో తన ఆలోచనలు ఎలా ఉన్నాయనే విషయంపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో సంజయ్ దత్ రియాక్ట్ అయ్యారు. తనకి రెగ్యులర్ గా వెన్నునొప్పి వస్తూ ఉండేది. అయితే అది సాధారణమైన నొప్పి అనుకోని పెయిన్ కిల్లర్స్ తీసుకునే వాడిని. కాని ఒక రోజు అకస్మాత్తుగా శ్వాస ఆడక ఇబ్బంది పడ్డాను.

అప్పుడు తనని కొంత మంది హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళారు. ఆ సమయంలో తన వెంట కుటుంబ సభ్యులు ఎవరూ కూడా లేరు. హాస్పిటల్ లో టెస్ట్ లు అన్ని చేసిన తర్వాత ఒక యువకుడు వచ్చి తాను క్యాన్సర్ బారిన పడినట్లు చెప్పాడు. అలాగే క్యాన్సర్ బారి నుంచి బయటపడాలంటే కీమోథెరపీ తీసుకోవాలని సూచించాడు. అయితే అప్పటీ తన తల్లి, మొదటి భార్య క్యాన్సర్ బారిన పడి మరణించారు. వారికి కీమోథెరపీ ట్రీట్మెంట్ ఇచ్చే సమయంలో ఎంతో ఇబ్బంది పడ్డారు.

శారీరకంగా ఎదురయ్యే ఇబ్బందులని ఎదుర్కోలేక సతమతం అవుతూ ఉండేవారు. వాటిని నా కళ్ళారా చూసాను. దీంతో క్యాన్సర్ ఎక్కువ చనిపోయిన పర్వాలేదు కాని ట్రీట్మెంట్ తీసుకోకూడదు అని అనుకున్నాను. అస్సలు కీమోథెరపీ తీసుకోకూడదు అని నిర్ణయించుకున్నా. అయితే తన సోదరి, తన భార్య మాన్యతా అండగా నిలబడి తనని ఒప్పించి, మానసిక ధైర్యం ఇచ్చి కీమోథెరపీ చికిత్స తీసుకునేలా చేసారు. వారి కారణంగా ఈ రోజు క్యాన్సర్ ని జయించి ఆరోగ్యంతో బయటకొచ్చాను అని సంజయ్ దత్ చెప్పుకొచ్చారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News