పొలిటికల్ ఎంట్రీకి రెడీ అయిన మరో హీరో

Update: 2023-01-11 17:30 GMT
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ఈసారి ఆసక్తి రేపుతోంది. వివిధ కారణాలతో జాతీయ మీడియాలో  పతాక శీర్షికలను తాకుతున్నాయి. దేశంలో తమ ఆధిపత్యాన్ని నిరూపించుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తుండగా, ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది. కుమార స్వామికి చెందిన జనతాదళ్(ఎస్) కూడా వచ్చే ఎన్నికల్లో తమ బలాన్ని నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తోంది.

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సినీ తారలు కూడా తమ రాజకీయ ప్రవేశంతో వార్తల్లో నిలుస్తున్నారు. ఉపేంద్ర ఇప్పటికే పార్టీ పెట్టి చాలా హంగామా తర్వాత దాని నుండి బయటకి వచ్చాడు. మరో కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ ను సోమవారం ఓ కాంగ్రెస్ మాజీ ఎంపీ కలిశారు. దీంతో సుదీప్ రాజకీయాల్లోకి వస్తాడనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. జేడీఎస్‌ అధినేత దేవెగౌడ గతంలో సుదీప్‌ను పార్టీలోకి ఆహ్వానించారు, అయితే ఆ ఆఫర్‌పై సుదీప్ అప్పట్లో స్పందించలేదు.

తన రాజకీయ ప్రవేశంపై సుదీప్‌ను ప్రశ్నించగా.. ఆయన సమాధానం ఇవ్వలేదు. ఇది స్నేహపూర్వక భేటీ అని తెలుస్తోంది. అయితే కర్ణాటక రాజకీయాలపై సుదీప్‌తో దాదాపు 2 గంటల పాటు చర్చించినట్లు సమాచారం.

నటుడు సుదీప్ కాంగ్రెస్ లో చేరాలని ఆ పార్టీ ఆహ్వానిస్తోంది. ఈ మేరకు పార్టీ మాజీ ఎంపీ రమ్య స్వయంగా సుదీప్ తో సంప్రదింపులు జరిపారు. వచ్చే విధానసభ ఎన్నికల నాటికి ప్రముఖ సినీ నటులను చేర్చుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది.  రమ్యతో భేటి నిజమేనని సుదీప్ తెలిపారు. అయితే సుదీప్ నిర్ణయం ఏమిటన్నది ఉత్కంఠ రేపుతోంది.

సుదీప్ రాజకీయాల్లోకి వస్తే, కర్ణాటక ఎన్నికలు మరింత ఆసక్తికరంగా మారుతాయి, ఎందుకంటే అతనికి యువతలో భారీ ఫాలోయింగ్ ఉంది. ఆయన ఎటువైపు నిలిస్తే అటువైపు ఎడ్జ్ ఉండే అవకాశం ఉంది.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News