కమెడియన్ గా సునీల్ స్టార్ స్టేటస్ ను అందుకున్నాడు. బ్రహ్మానందం .. ఎమ్మెస్ వంటి వారు బరిలో ఉన్నప్పుడే తానేమిటనేది నిరూపించుకున్నాడు. ఆ తరువాత హీరోగాను తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. హీరోగా అవకాశాలు తగ్గిన తరువాత మళ్లీ కమెడియన్ గా బిజీ కావడానికి ప్రయత్నిస్తూ వచ్చాడు. ఈ లోగా చేతికి అందిన విలక్షణమైన పాత్రలను సైతం చేసి శభాష్ అనిపించుకున్నాడు. నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలను సైతం సునీల్ గొప్పగా చేయగలడని నిరూపించుకున్నాడు. అలాంటి సునీల్ తాజా చిత్రంగా 'ఎఫ్ 3' ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ నేపథ్యంలో ఈ సినిమాను గురించి సునీల్ మాట్లాడుతూ .. "నాకు చాలా ఇష్టమైన దర్శకులలో అనిల్ ఒకరు. తనతో వర్క్ చేసేటప్పుడు ఏ రకమైన టెన్షన్ ఉండదు. ఆర్టిస్ట్ టైమింగ్ కి తగినట్టుగా చెప్పడం ఆయన స్పెషాలిటీ. యాక్షన్ .. కామెడీ ఇలా ఏదైనా తాను అద్భుతంగా తీయగలడు. ఈ సినిమాలో ఎంతో మంది ఆర్టిస్టులు ఉన్నారు .. అయినా ఎవరికీ ఎలాంటి టెన్షన్ లేదు .. ఇబ్బంది లేదు. మళ్లీ ఆయనతో కలిసి ఎప్పుడు చేస్తానా అని ఎదురుచూసేంతగా చేస్తాడు. వెంకటేశ్ గారి కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. ఆయనతో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది.
ఈ సినిమా కోసం మొత్తం 16 కారవాన్లు ఉండేవి. చూడటానికి ఒక బస్ డిపోలా ఉండేది. దీనిని బట్టి ఎంతమంది ఆర్టిస్టుల ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఈ మధ్య కాలంలో ఇంతమంది ఆర్టిస్టులను పెట్టి .. ఇంతటి ఫన్ ను అందించే సినిమా ఇప్పట్లో రాదు. ఈ విషయంలో ఎలాంటి డౌట్ లేదు. చాలా కాలం తరువాత ఇక పూర్తిస్థాయి కామెడీ రోల్ చేశాను. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి ఒక అవకాశాన్ని ఇచ్చిన దిల్ రాజుగారికి .. అనిల్ రావిపూడి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
కోవిడ్ కారణంగా అంతా కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులను చూశారు. రెండేళ్ల పాటు సరైన ఎంటర్టైన్మెంట్ ను పొందలేకపోయారు. అలాంటివాళ్లందరికీ ఈ సినిమా నాన్ స్టాప్ ఎంటర్ టైన్మెంట్ ను అందిస్తుంది. అందుకు నేను గ్యారెంటీ ఇస్తున్నాను. ఈ సినిమా మొదటి నుంచి చివరి వరకూ నేను ఉంటాను. చాలా ఎంజాయ్ చేస్తూ ఈ సినిమా చేశాను. ఎవరికివారు ఈ సినిమాలో అద్భుతంగా చేశారు. ఈ నెల 27వ తేదీన ఈ సినిమా భారీ స్థాయిలో విడుదలవుతుంది. తప్పకుండా చూసి ఎంజాయ్ చేయండి"అని చెప్పుకొచ్చాడు.