పరాయి భాషల హీరోల తీరు చూస్తే కొన్నిసార్లు షాక్ తినాల్సిందే. వివాదాస్పద అంశాల్లో వారి తీరు సూటిగా..స్పష్టంగా ఉండటమే కాదు.. మనసులోని భావాల్ని స్వేచ్ఛగా చెప్పే తీరు చూస్తే ముచ్చటేయక మానదు. అదే సమయంలో.. మన తెలుగుహీరోల్లో ఇలాంటి మైండ్ సెట్ ఉన్న యువహీరోలు ఒక్కరూ లేరనే భావన కలగక మానదు.
ఇష్యూ ఏదైనా.. దాని గురించి స్పందించేందుకు మన హీరోలు అస్సలు ఇష్టపడరు. ఇక.. వివాదాస్పద అంశాలు.. సున్నితమైన సమస్యల పట్ల.. ప్రజలు ఆందోళనలు చేసే విషయాలు తమకు అసలు తెలీదన్నట్లుగా వ్యవహరిస్తుంటారు. తమిళనాడులో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన జల్లికట్టుపై తమిళ్ హీరో సూర్య సంచలన వ్యాఖ్యలు చేశారు.
జల్లికట్టును వ్యతిరేకిస్తున్న పెటా సంస్థపై విరుచుకుపడ్డ ఆయన.. స్థానిక జాతి జంతువుల అంతర్థానానికి కారణం అవుతున్న వారే.. జంతు హక్కుల గురించిమాట్లాడటం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. జల్లికట్టుకు మద్దుతుగా ఆందోళన చేస్తున్న వారికి అండగా నిలిచిన ఆయన.. ప్రజలు చేస్తున్న ఆందోళనలు సబబేనని వ్యాఖ్యానించటం గమనార్హం.
త్వరలో సింగం త్రీగా రానున్న ఆయన.. అబద్ధాలతో ప్రచారం చేసిన పెటా న్యాయస్థానంలో విజయం సాధించినా.. ప్రజాకోర్టులో మాత్రం ఓడిపోయిందన్న మాటలు చూస్తే.. సున్నిత అంశాల మీద సూర్య మాదిరి ఓపెన్ గా మాట్లాడే దమ్ము మన తెలుగు హీరోలకు లేదన్న మాట వినిపిస్తోంది. ఎక్కడి వరకో ఎందుకు.. సంక్రాంతి పండగ సందర్భంగా ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారు పెద్ద ఎత్తున కోడి పందాల్ని నిర్వహిస్తుంటారు. దీనిపై జరుగుతున్న వివాదంపై ఒక్క హీరో అంటే ఒక్క హీరో మాట్లాడకపోవటం దీనికి నిదర్శనంగా చెప్పొచ్చు. కోలీవుడ్ హీరోల మాదిరి టాలీవుడ్ హీరోలో తమ అభిప్రాయాల్ని ఓపెన్ గా ఎందుకు చెప్పరో..?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/