తమిళసినీ ఇండస్ట్రీని 1980-90వ దశకంలో తన సినిమాలతో ఊపు ఊపేశాడు హీరో విజయ్ కాంత్. యాక్షన్ హీరోగా ఎంతో పాపులర్ అయ్యాడు. తెలుగులోనూ పలు సినిమాలు డబ్ చేసి ఇక్కడి వారికి సుపరిచితం అయ్యాడు. అయితే క్రమంగా వయసు పెరగడంతోపాటు సినిమాలు తగ్గించేశాడు. రాజకీయాల్లోకి వెళ్లి చేతులు కాల్చుకున్నారు.
ఇక గత రెండేళ్లుగా విజయ్ కాంత్ అనారోగ్యంతో బాధపడుతూ ఇంటికే పరిమితమయ్యారు. ఈ కారణంగా ఆయన ఆకారం, ముఖంలో మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫొటోను చూస్తే ఈయన నిజంగా విజయ్ కాంత్ యేనా? అన్న సందేహం ప్రేక్షకులకే కాదు ఆయన అభిమానులు, డీఎండీకే కార్యకర్తలకు వస్తోంది.
కోలీవుడ్ రజినీకాంత్, కమల్ హాసన్ హవా కొనసాగుతున్న తరుణంలోనూ విజయ్ కాంత్ కు కూడా ప్రత్యేక ఫ్యాన్స్ ఫాలోయింగ్ కొనసాగుతోంది. ప్రధానంగా కుటుంబ, పోలీస్ కథా చిత్రాల్లో నటించి అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించారు. ఆ తర్వాత సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టి డీఎండీకే పార్టీని స్థాపించారు.
దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవించి ఉన్న సమయంలోనే ఆమెకు ధీటుగా రాజకీయ పావులు కదిపారు. అయితే ఆయన అనారోగ్యం బారినపడడంతో క్రియాశీలక రాజకీయాలకు కూడా దూరమయ్యారు.
ప్రస్తుతం ఆయన ఇంటిపట్టునే ఉంటూ వైద్యసేవలు పొందుతున్నారు. ఈనేపథ్యంలో విజయ్ కాంత్ కు చెందిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.