ప్రేమ గురించి క్లారిటీ ఇచ్చిన సీతమ్మ

Update: 2019-02-06 05:57 GMT
పేరుకు తెలుగు అమ్మాయి కాని కోలీవుడ్ లోనే మంచి పేరు తెచ్చుకున్న అంజలి అక్కడే సెటిల్ అయిపోయింది . తెలుగులో వెంకటేష్ సరసన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చినా అదేమంత అవకాశాలు తీసుకురాలేకపోయింది. గీతాంజలి సూపర్ హిట్ అయినా అది హారర్ జానర్ కావడంతో గ్లామర్ రోల్స్ దక్కే ఛాన్స్ లేకపోయింది. పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ పాత్రలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే అంజలి ఇటీవలే మమ్ముట్టితో మొదటిసారి పెరంబు అనే సినిమాలో నటించింది. అది విమర్శకుల నుంచి ప్రశంశలు అందుకోవడంతో తన ఆనందం మాములుగా లేదు.

ఇకపోతే హీరో జైతో అంజలి ప్రేమాయణం గురించి చాలా కథలు పుకార్లు నెలల తరబడి ప్రచారంలో ఉన్నాయి. జర్నీ సినిమాలో కలిసి నటించినప్పటి నుంచి ఈ ఇద్దరి మధ్య సంథింగ్ ఉందనే టాక్ చాలా కాలం నడిచింది. అయితే దానికి సంబంధించి ఇన్నాళ్ళు సైలెంట్ గా ఉన్న అంజలి ఓ తాజా ఇంటర్వ్యూ లో ఓపెన్ అయిపోయింది. అసలు జైతో తన అనుబంధం గురించి తాను ఎక్కడా చెప్పలేదని మీడియానే ఏదేదో ఊహించుకుని తమ చుట్టూ ప్రేమ అల్లేసిందని దానికి నేను ఎందుకు సమాధానం చెప్పాలని రివర్స్ అయ్యింది.

ఒకప్పుడు ఇలాంటి గాసిప్స్ కు తెగ బాధపడిపోయి ఏడ్చేదాన్నని ఇప్పుడు వాటిని పట్టించుకోకుండా కెరీర్ మీద దృష్టి పెడుతున్నానని చెప్పింది. పెళ్లి గురించి ఆలోచించే టైం కూడా లేదట. ఈ మధ్య కాస్త గ్లామర్ డోస్ పెంచుతున్న అంజలికి పైకి కనిపించడం లేదు అవకాశాలు బాగానే వస్తున్నాయి. నాదోడగల్ 2-లీసా-సిందుబాద్ తన ఖాతాలోనే ఉన్నాయి. ఇవన్ని షూటింగ్ దశలో కొనసాగుతున్నాయి. మొత్తానికి జైతో తనకు ఏ లవ్ స్టొరీ లేదంటున్న అంజలి ఫైనల్ గా పుకార్లకు చెక్ పెట్టినట్టేనా



Tags:    

Similar News