ఆ టెంపుల్ లో ప్రత్యక్షమైన సాయి పల్లవి..!

Update: 2023-01-09 02:30 GMT
టాలీవుడ్ లో హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న కథానాయికల్లో సాయి పల్లవి ఒకరు. ఆమె చేస్తున్న సినిమాలు.. వాటిలోని పాత్రలు ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేస్తున్నాయి. గ్లామర్ షోకి ఏమాత్రం ఛాన్స్ ఇవ్వని సాయి పల్లవి తన నటనతోనే ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తుంది. లేడీ పవర్ స్టార్ అన్న ట్యాగ్ లైన్ మన మేకర్స్ ఇచ్చినా అంత పెద్ద బాధ్యత తన వల్ల కాదని ఒప్పేసుకుంది సాయి పల్లవి. లాస్ట్ ఇయర్ విరాట పర్వం, గార్గి సినిమాల్లో నటించిన సాయి పల్లవి ఆ సినిమాలతో మరోసారి తన స్పెషాలిటీ చాటుకుంది.

ఇక న్యూ ఇయర్ నాడు హీరోయిన్స్ అంతా కూడా పార్టీలు, పబ్బులు అంటూ పార్టీ మూడ్ లో ఉంటే సాయి పల్లవి మాత్రం పుట్టపర్తి సాయి బాబా ఆశ్రమంలో పూజలో పాల్గొన్నది. ఇక లేటెస్ట్ గా ఎత్తియమ్మన్ మాత టెంపుల్ లో దర్శనమిచ్చింది సాయి పల్లవి. తమిళనాడులో కట్టుపాక్కం లోని అమ్మన్ నగర్ లోని ఎత్తియమ్మన్ టెంపుల్ లో అక్కడ సంప్రదాయ వస్త్రాలతో పూజా కార్యక్రమంలో పాల్గొన్నది సాయి పల్లవి. ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పూర్తిగా ఆధ్యాత్మిక భావనలో కొత్త సంవత్సరానికి వెల్కం చెప్పింది సాయి పల్లవి.

న్యూ ఇయర్ వచ్చి వారం అవుతున్నా ఇంకా ఆమె పుణ్యక్షేత్రాలను దర్శిస్తూనే ఉంది. ఓ పక్క ఆమె నెక్స్ట్ సినిమా కోసం ప్రేక్షకులు, ఫ్యాన్స్ అంతా ఈగర్ గా ఎదురుచూస్తుంటే సాయి పల్లవి మాత్రం ఇలా టెంపుల్స్ చుట్టూ తిరుగుతుంది. హీరోయిన్ గా తనకు ఇంత క్రేజ్ వచ్చినా ఆ బిల్డప్ ఏమి లేకుండా సాయి పల్లవి సాధారణ భక్తురాలిగా దైవ దర్శనాలు చేసుకుంటుంది.ఇప్పటికే తన మంచి లక్షణాలతో ఫ్యాన్స్ ని మెప్పిస్తున్న సాయి పల్లవి ఇలా కూడా వారికి మరింత దగ్గర అవుతుంది.

ఇంత మంచి తనం ఉంది కాబట్టే ఆమె చేస్తున్న పాత్రలు ప్రేక్షకులను అంత బాగా ఆకట్టుకుంటున్నాయి. తను చేస్తున్న ప్రతి పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తున్న సాయి పల్లవి విషయం ఉన్న కథలను మాత్రమే చేస్తూ వస్తుంది. అందుకే ఆమె అందరి హీరోయిన్స్ కంటే చాలా స్పెషల్ గా నిలుస్తూ వస్తుంది. పాత్ర ప్రాధాన్యత ఉన్న సినిమాలనే చేస్తూ తనకంటూ ఒక స్పెషల్ క్రేజ్ ఏర్పరచుకున్న సాయి పల్లవి ఇక మీదట కూడా అలాంటి సినిమాలనే చేయాలని చూస్తుంది.
Tags:    

Similar News