హాట్ సీన్సే కానీ లక్షణంగా ఉంటుందట

Update: 2017-11-08 12:28 GMT
మొన్నటి వరకు సౌత్ ఇండస్ట్రీలో సినిమాలను చేస్తూ.. అందంగా అందాలను ఆరబోసిన లక్ష్మి రాయ్ బాలీవుడ్ లో అలా అడుగుపెట్టిందో లేదో గాని నార్త్ జనాల చూపును తనవైపు తిప్పేసుకుందనే చెప్పాలి. అమ్మడు నటించిన జూలీ 2 ట్రైలర్ తోనే చంపేసింది. లిమిట్స్ లేకుండా లో ఈత దుస్తుల్లో కనిపించింది. జనాలు ఆ ట్రైలర్ ని చూసి అసలు లక్ష్మీ రాయ్ ఇలా చేసిందా అనుకుంటే ముక్కుమీద వేలేసుకున్నారు.

మరికొన్ని రోజుల్లో ఈ సినిమా హిందీ - తమిళ్ లో రిలీజ్ కాబోతోంది. అయితే సినిమా గురించి ఒక రూమర్ చాలా గట్టిగా వినిపిస్తోంది. బాలీవుడ్ లో సెన్సార్ కట్ లేకుండా సినిమా రెడీ అయ్యిందట. కానీ కోలీవుడ్ లో మాత్రం హాట్ సీన్స్ కు కత్తెరలు పడ్డాయని అనేక మీడియాలో కథనాలు కూడా వెలువడ్డాయి. దీంతో సినిమాకి ఎఫెక్ట్ పడుతుందేమో అని లక్ష్మి రాయ్ క్లారిటీ ఇచ్చింది. బాలీవుడ్ లో కోలీవుడ్ లో ఈ సినిమా ఎలాంటి కట్ లేకుండా విడుదల అవుతోంది. ఆ న్యూస్ అనేది అబద్దమని చెబుతూ.. సినిమాను చూసిన సెన్సార్ సభ్యులే ఫిదా అయ్యారనేలా చెప్పుకొచ్చింది.

బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ గా తాను సినిమాలో కనిపించానని ప్రతి ఒక్కరికి నచ్చుతుందని వివరించింది. అంతే కాకుండా ఆ సీన్స్ చాలా హాట్ గా ఉన్నాయని అనుకుంటున్నారు. కానీ అలాంటి సీన్స్ రావడానికి సినిమా కంటెంట్ అని సినిమా చూస్తే అర్థమవుతోందని చెప్పేసింది. మరి అమ్మడు చెప్పినట్లు సినిమా ఉంటుందో లేదో తెలియాలంటే రిలీజ్ డేట్ వరకు ఆగాల్సిందే. నవంబర్ 24న సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.



Tags:    

Similar News