'సీఎంలు పారాసిటమాల్ సరిపోతది అన్నారు' అంటున్న హీరోయిన్

Update: 2020-03-17 21:30 GMT
దేశమంతా కరోనా భయంతో వణికి చస్తుంటే.. మన తెలుగు రాష్ట్రాలు మాత్రం పెద్దగా భయపడాల్సిన పనిలేదు అనే ధోరణిని ప్రదర్శిస్తున్నట్లు అన్పిస్తుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్ ను ఎదుర్కోవడానికి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నాయి. అంతేగాక రాజకీయ నాయకులు, ప్రముఖులు వారి గళంతో ప్రజలలో ధైర్యాన్ని నింపడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కరోనా భయం ప్రజలలో పోగొట్టేందుకే రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కరోనా పై ప్రసంగించారు.

అయితే వారి ప్రసంగంలో భాగంగా కరోనా వైరస్ కు జ్వరం వస్తే వేసుకునే 'పారాసిటమాల్' సరైంది అని, ఆ గోలి వేసుకుంటే కరోనా మన దగ్గరకు రాదని బహిరంగంగా వెల్లడించ్చారు. కానీ ఇప్పుడు తీసుకుంటున్న భద్రత చర్యలు చూస్తుంటే కరోనా ఒక్క పారాసిటమాల్ తో ఆగేది కాదని అర్ధమవుతుంది. ఈ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల 'పారాసిటమాల్' వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో మీమ్స్, కామెంట్లతో రచ్చ చేస్తున్నారు. ఇదిలా ఉండగా సీఎంల వ్యాఖ్యలపై హీరోయిన్ మాధవీలత చేసిన సెటైరికల్ పోస్ట్ నెట్టింట వివాదాస్పదంగా మారింది.

మొన్నీమధ్యే బీజేపీలో చేరిన మాధవీలత ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయింది. ఇక సినిమా అవకాశాలు కూడా లేక ముఖ్యమంత్రులపై విరుచుకుపడుతుందని పబ్లిక్ టాక్. సీఎం కెసిఆర్- వైఎస్ జగన్ కలిసి బొకే అందుకుంటున్న పాత ఫోటోను ఎడిట్ చేసి బొకే ప్లేస్ లో పారాసిటమాల్ టాబ్లెట్ ఫోటో పెట్టింది. ఆ ఫోటోను పేస్ బుక్ లో పోస్టు చేస్తూ సెటైరికల్ గా.."ఇస్తినమ్మ వాయనం.. పుచ్చుకుంటినమ్మ వాయనం.." అంటూ వివాదాస్పదమైన వ్యాఖ్యలు జోడించింది. ఈ విషయంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చకే తెరలేపింది మాధవీలత.
Tags:    

Similar News