వీడియో: ఫారిన్ వీధుల్లో ఎవ‌రీ పంచ‌దార బొమ్మ‌?

Update: 2022-08-24 15:17 GMT
విదేశీ వీధుల్లో అలా అలా చిట్టి గువ్వ‌లా హొయ‌లొలికిస్తున్న ఈ ల‌ల‌నామ‌ణి ఎవ‌రై ఉంటారు?  ఆకాశం నుంచి దిగి వ‌చ్చిన చంద‌మామా.. లేక సాగ‌ర మ‌దనం నుంచి పుట్టుకొచ్చిన దేవ‌తా విగ్ర‌హ‌మా? ఇంత‌కీ ఎవ‌రై ఉంటారో కానీ.. మిల్కీ వైట్ అందాల‌తో కుర్ర‌కారు గుండెల్ని చిదిమేస్తోంది.

హ‌నీ ఈజ్ ది బెస్ట్ అని పిలుచుకున్నా.. పంజాబీ క్వీన్ మెహ్రీన్ కౌర్ అని పిలుచుకున్నా ఎంతో ఇదిగా తెలుగు యువ‌త త‌మ గుండెల్లో దాచుకుని పూజిస్తున్నారు ఈ భామ‌ను. అందుకే  హిట్టు ఫ‌ట్టుతో సంబంధం లేకుండా వ‌రుస‌గా టాలీవుడ్ లో అవ‌కాశాలు అందుకుంటోంది.

ఎఫ్ 3తో విజ‌యం అందుకున్నా కానీ అంత‌కుముందు స‌రైన స‌క్సెస్ లేక అవ‌కాశాలు త‌గ్గాయి. అయితే యూత్ లో మెహ్రీన్ కి ఉన్న క్రేజును దృష్టిలో పెట్టుకుని మ‌న ద‌ర్శ‌క‌ నిర్మాత‌లు ఇప్ప‌టికీ అవ‌కాశాలిస్తున్నారు.

ఇటీవ‌ల కొంత‌కాలంగా సోష‌ల్ మీడియాల్లో ట్రెండీ ఫోటోషూట్ల‌తో హీటెక్కిస్తోంది. నిరంత‌రం అభిమానుల‌కు ఏదో ఒక రూపంలో ట‌చ్ లో ఉంటోంది. మెహ్రీన్ తాజా వీడియో షూట్ కుర్ర‌కారు గుండెల‌ను హ‌త్తుకుంది. విదేశీ విహార‌యాత్ర‌లో అద్భుత‌మైన ఫోటోషూట్ ఇది. ర‌క‌ర‌కాల డిజైన‌ర్ దుస్తుల‌ను ధ‌రించడ‌మే గాక‌.. ఎవ్వ‌ర్ గ్రీన్ అనిపించే బికినీ లుక్ లోను గుబులు రేపింది.

ఇటు భూమిపైనా అటు స‌ముద్రంలోనూ సంచ‌రించే హావ‌ర్ క్రాఫ్టులా మెహ్రీన్ హొయ‌లు గ‌మ్మ‌త్తుగా మ‌త్తెక్కిస్తున్నాయ్. ఫారిన్ వీధుల్లో ఎవ‌రీ పంచ‌దార బొమ్మ‌?  అంటూ ఒక యువ‌కుడు కామెంట్ చేయ‌గా... మెహ్రీన్ ధూమ్మ‌చాలే అంటూ మ‌రో యంగ్ బోయ్ వేడెక్కించే వ్యాఖ్య‌ను చేశాడు. మెహ్రీన్ తో పాటు ఆ ప్లేస్ కూడా ఎంతో సుంద‌రంగా ఉంది అంటూ కితాబిచ్చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ వీడియో అంత‌ర్జాలంలో సునామీ వేగంతో దూసుకుపోతోంది.

మెహ్రీన్ ప్ర‌స్తుతం `నీ  సిగూవ‌రేగు` అనే క‌న్న‌డ చిత్రంతో పాటు స్పార్క్ అనే తెలుగు చిత్రంలోనూ న‌టిస్తోంది. ఈ సినిమాల‌కు సంబంధించిన అప్ డేట్ తెలియాల్సి ఉంది.


Tags:    

Similar News