మెగా హీరో వరుణ్ తేజ్ - మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన మూవీ 'గడ్డలకొండ గణేష్' (వాల్మీకి). 14 రీల్స్ బ్యానర్ పై రామ్ ఆచంట - గోపీచంద్ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో మృణాళిని రవి - పుజాహెగ్డే - అధర్వ మురళి ఇతర ప్రధాన పాత్రలలో నటించారు. తమిళ్ లో సూపర్ హిట్ అయిన 'జిగర్తాండ' సినిమాకి రీమేక్ గా ఈ సినిమా రూపొందింది. ఈ చిత్రాన్ని మన నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేర్పులు చేసి రీమేక్ ల స్పెషలిస్ట్ హరీష్ శంకర్ తెలుగు ప్రేక్షకులకు అందించాడు. కానీ తెలుగులో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. అయినప్పటికీ హీరో వరుణ్ కి డైరెక్టర్ హరీష్ కి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇక స్పెషల్ రోల్ లో కనిపించిన పూజాహెగ్డే 'ఎల్లు వచ్చి గోదారమ్మ' అనే ఒక్క పాటతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే టాలీవుడ్ లో పాగా వేయాలని ఎన్నో ఆశలు పెట్టుకున్న హీరోయిన్ మృణాళినికి మాత్రం నిరాశే ఎదురైంది.
కాగా, చెన్నై బేసేడ్ స్టార్ మృణాళిని ని టాలీవుడ్ లో స్టార్ ని చేయడానికి హరీశ్ శంకర్ చాలా ట్రై చేశాడు. అయితే కథలో చాలా కీలకమైన పాత్రలో అమ్మడు బాగానే నటించింది అనే కామెంట్స్ వచ్చాయి. కానీ తెలుగులో ఆ తర్వాత ఒక్క ఆఫర్ కూడా రాలేదు. నిజానికి హరీష్ శంకర్ సినిమాలలో నటించిన ప్రతీ హీరోయిన్ తర్వాత రోజుల్లో టాప్ పొజిషన్ కి చేరుకున్న వారే. కానీ ఒక్క 'గడ్డలకొండ గణేష్' హీరోయిన్ కి మాత్రమే తెలుగులో అవకాశాలు కరువయ్యాయి. దీంతో చేసేదేమీ లేక తమిళ కన్నడ ఇండస్ట్రీలపై ఫోకస్ పెట్టిన మృణాళిని అక్కడ మాత్రం అవకాశాలు అందిపుచ్చుకుంటోంది. అయితే ఇప్పుడు టాలీవుడ్ యువ హీరోలు శర్వానంద్ - నాగశౌర్య వంటి మీడియం రేంజ్ హీరోల సినిమాల్లో నటించడానికి మృణాళిని ప్రయత్నాలు చేస్తోందని తెలుస్తోంది. మరి అమ్మడికి ఛాన్స్ వచ్చి తెలుగులో గుర్తింపు తెచ్చుకుంటుందేమో చూడాలి.