సినిమాల్లో ఛాన్స్ లు కావాలంటే పడకగదికి వెళ్లాల్సిందేనన్న నగ్నసత్యాన్నికొందరు నటీమణులు ధైర్యంగా కుండబద్ధలు కొట్టేయటం ఆ మధ్యన పెను సంచలనాలన్ని సృష్టించింది. కోలీవుడ్ గాయని సుచిత్ర విడుదల చేసిన కొన్ని ఫోటోలు.. వీడియో సృష్టించిన సంచలనం సద్దుమణగకముందే.. నటీమణులకు ఎదురయ్యే చేదు అనుభవాల గురించి కోలీవుడ్ నటీమణులు వరలక్ష్మీ శరత్ కుమార్.. సంధ్య.. కస్తూరి లాంటివారు ఇప్పటికే ధైర్యంగా గళం విప్పిన సంగతి తెలిసిందే.
తమకు ఎదురైన చేదు అనుభవాల్ని ధైర్యంగా బయటపెట్టిన సదరు హీరోయిన్ల బాటనే పట్టింది కోలీవుడ్ కు పరిచయమైన మలయాళ నటి పార్వతి. ధనుష్ కు జంటగా మారియాన్.. ఆర్య..రానా.. బాబిసింహాలతో కలిసి బెంగళూరు డేస్ చిత్రాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ చేసింది తక్కువ సినిమాలే అయినా.. తన అందంతో.. తన నటనతో యువహృదయాల్ని కొల్లగొట్టేసింది. మలయాళంలోనూ నటిస్తున్న ఈ భామ ఒక టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ ఇప్పుడు సంచలనంగా మారింది.
హీరోయిన్లతో చిత్ర పరిశ్రమ ఎలా ప్రవర్తిస్తుందన్న ప్రశ్నకు సమాధానం ఇచ్చిన ఆమె.. తాజాగా జరుగుతున్న ప్రచారం నిజమేనన్న పార్వతి.. అవకాశం కావాలంటే బెడ్రూంకు రావాలనే మాట తనకు కూడా ఎదురైనట్లు పేర్కొన్నారు. మలయాళంలో అవకాశాల పేరుతో హీరోలు.. దర్శకులు తనను పలుమార్లు బెడ్రూంకు రావాలన్నారని.. సినిమా ఇండస్ట్రీలో ఇలాంటివి కామన్ అంటూ ఉచిత సలహా ఇచ్చారన్నారు. తాను అందుకు నో చెప్పటంతో ఇంట్లో ఖాళీగా కూర్చోవాల్సి వచ్చిందన్న విషయాన్ని చెప్పారు. తాను తక్కువ సినిమాలు చేయటానికి.. ‘బెడ్రూం’ వ్యవహారానికి నో చెప్పటమే కారణంగా చెప్పారు. పార్వతి మాటలు ఇప్పుడు సంచలనంగా మారాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/