నారి ది ఉమెన్.. ట్రైలర్ టాక్..!
నారి ట్రైలర్ నిజంగానే ఒక గొప్ప అటెంప్ట్ అని చెప్పొచ్చు. ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. మార్చి 7న రిలీజ్ అవుతున్న ఈ సినిమాను ప్రేక్షకులకు చేరవయ్యేలా చేస్తున్నారు.
రెండున్నర గంటల సినిమాలో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే కథలు కొన్నైతే ఆలోచింపచేసే కథలు కొన్ని ఉంటాయి. జోనర్ ఏదైనా సినిమాతో ప్రేక్షకులకు ఎంటర్టైన్ చేయడమా లేదా ఒక కొత్త విషయాన్ని చెప్పడమే అన్నది జరుగుతుంది. ఐతే ఇలాంటి టైం లో నేటి సమాజంలో జరుగుతున్న ముఖ్యంగా మహిళ పడుతున్న ఇబ్బందులు గురించి ఒక కథను కథనాన్ని నడిపించిన సినిమాగా నారి ది ఉమెన్ వస్తుంది.
సూర్య వంటిపల్లి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో ఆమని, ప్రగతి, వికాస్ వశిష్ట, నిత్య శ్రీ, కార్తికేయ ప్రధాన పాత్రలుగా నటించారు. ఈ సినిమాకు సంబందించిన ట్రైలర్ లేటెస్ట్ గా రిలీజ్ చేశారు. ఈ సినిమా ట్రైలర్ లో ఒక మహిళ వివిధ సందర్భాల్లో పడుతున్న ఇబ్బందుల గురించి ప్రస్తావించారు. కొడుక్కి జీవిత పాఠం చెప్పిన ఒక టీచర్ అతను తప్పు చేస్తే ఎలా శిక్షిస్తుంది అన్నది కూడా చూపించారు. దాదాపు నేటి సమాజంలో జరుగుతున్న నిజ జీవిత సంఘటన ఆధారంగానే అలాంటి వాఋటి స్పూర్తితోనే ఈ సినిమా కథ రాసుకున్నట్టు అర్థమవుతుంది.
నారి ట్రైలర్ నిజంగానే ఒక గొప్ప అటెంప్ట్ అని చెప్పొచ్చు. ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. మార్చి 7న రిలీజ్ అవుతున్న ఈ సినిమాను ప్రేక్షకులకు చేరవయ్యేలా చేస్తున్నారు. ఈ సినిమాను షీ ఫిలింస్, హైదరాబాద్ స్టూడియోస్ బ్యానర్ లో శశి వంటిపల్లి, సూర్య వంటిపల్లి కలిసి నిర్మిస్తున్నారు. నారి సినిమాకు సినిమాటోగ్రఫీ వి రవి కుమార్, భీం సాంబ చేయగా వినోద్ కుమార్ విన్ను సంగీతం అందించారు.
నేటి సమాజంలో మహిళ పడుతున్న ఇబ్బందులను అద్దం పట్టేలా నారి సినిమా కథ ఉంటుందని తెలుస్తుంది. ట్రైలర్ కట్ ఇంప్రెస్ చేసింది. సీనియర్ యాక్టర్ ఆమని ఆఫ్టర్ లాంగ్ టైం ఒక మంచి పాత్ర చేసినట్టు అనిపిస్తుంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏమేరకు మెప్పిస్తుంది అన్నది చూడాలి. దర్శక నిర్మాత సూర్య వంటిపల్లి ఈ సినిమా విషయంలో చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఒక సిన్సియర్ ఎఫర్ట్ ని ఎప్పుడూ తెలుగు ప్రేక్షకులు మెచ్చుకుంటారు.. అలాంటి సినిమాలకు వారి సపోర్ట్ అందిస్తారు. అలాంటి ప్రయత్నంలో భాగంగానే వస్తున్న ఈ నారి ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.