ఆస్కార్స్ 2025: వరల్డ్ బెస్ట్ స్టార్లతో సందడే సందడి
97వ అకాడమీ అవార్డులు మార్చి 2 ఆదివారం నాడు ABCలో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. అమెరికా- లాస్ ఏంజిల్స్ ప్రాంతం కార్చిచ్చుతో నాశనమైన కొన్ని నెలల తర్వాత ఈ వేడుక జరగనుంది.
97వ అకాడమీ అవార్డులు మార్చి 2 ఆదివారం నాడు ABCలో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. అమెరికా- లాస్ ఏంజిల్స్ ప్రాంతం కార్చిచ్చుతో నాశనమైన కొన్ని నెలల తర్వాత ఈ వేడుక జరగనుంది. ఈ సంవత్సరం ఆస్కార్ వేడుకలను.. ప్రపంచ చలనచిత్ర సమాజం ఓ చోట ఏకమవ్వడానికి సెలబ్రేషన్ గా చూడాలి. అమెరికా లాస్ ఏంజెల్స్‌లో విరుచుకుపడ్డ అడవి మంటలకు భయపడక ధైర్యంగా పోరాడిన వారిని గుర్తించే వేడుక కానుంది! అని నిర్వాహకులు హామీ ఇచ్చారు. ఆస్కార్స్ ఉత్సవాల్లో హాస్యనటుడు, మాజీ లేట్-నైట్ హోస్ట్ కోనన్ ఓ బ్రియన్ హోస్ట్‌గా వేదికపై సందడి చేస్తారు. 2023-2024లో కామెంటేటర్‌గా పనిచేసిన జిమ్మీ కిమ్మెల్ నుండి ఓ బ్రియన్ ఆస్కార్ హోస్టింగ్ బాధ్యతలను స్వీకరించారు. ఆస్కార్స్- 2025 లో ఎమిలియా పెరెజ్ 13 ఆస్కార్ నామినేషన్లతో చరిత్ర సృష్టించింది. ఆంగ్లేతర భాషా చిత్రం విభాగంలో ఇది రికార్డులను బద్దలు కొట్టింది.
అలాగే ఈ వేదికపై సెలీనా గోమెజ్, బెన్ స్టిల్లర్, ఓప్రా విన్‌ఫ్రే అవార్డులను ప్రదానం చేయనున్నారు. ఈసారి కొత్త లైనప్‌ను కూడా తాజాగా అకాడెమీ ధృవీకరించింది. సెలీనా గోమెజ్ (మొదటిసారి ఆస్కార్ నామినీ), బెన్ స్టిల్లర్, ఓప్రా విన్‌ఫ్రే, స్టెర్లింగ్ కె. బ్రౌన్, విల్లెం డాఫో, అనా డి అర్మాస్, లిల్లీ-రోజ్ డెప్, గోల్డీ హాన్, కోనీ నీల్సన్ , జో ఆల్విన్ కొత్తగా ప్రకటించిన ప్రముఖులలో ఉన్నారు. ఈ వేడుకలో నిక్ ఆఫర్‌మాన్ అనౌన్సర్ పాత్రను పోషిస్తారని కూడా ధృవీకరించారు. ఈ తారలు గతంలో అవార్డులను ప్రకటించిన ప్రెజెంటర్లు హాలీ బెర్రీ, పెనెలోప్ క్రజ్, ఎల్లే ఫానింగ్, హూపి గోల్డ్‌బర్గ్, స్కార్లెట్ జోహన్సన్, జాన్ లిత్‌గో, అమీ పోహ్లర్, జూన్ స్క్విబ్ , బోవెన్ యాంగ్‌లతో టీమ్‌లో చేరతారు.
కొన్ని రోజుల క్రితం.. అకాడమీ గత సంవత్సరం నటన విభాగాల విజేతలు - సిలియన్ మర్ఫీ (ఉత్తమ నటుడు), ఎమ్మా స్టోన్ (ఉత్తమ నటి), రాబర్ట్ డౌనీ జూనియర్ (ఉత్తమ సహాయ నటుడు), డావైన్ జాయ్ రాండోల్ఫ్ (ఉత్తమ సహాయ నటి) వంటి వారు ఈ సంవత్సరం వేడుకలో విజేతలకు వారి వారి అవార్డులను ప్రదానం చేయనున్నారు.