ఇంతకీ పూజా ఉన్నట్టా లేనట్టా ?

Update: 2019-05-14 05:00 GMT
టాలీవడ్ లోనే డెబ్యూ జరిగినా సక్సెస్ కోసం మూడేళ్లు ఎదురు చూసిన పూజా హెగ్డే ఇప్పుడు టాప్ ఫామ్ లో ఉంది. గత ఏడాది అరవింద సమేత వీర రాఘవతో సూపర్ సక్సెస్ అందుకున్న ఈ బ్యూటీ తాజాగా మహర్షి బ్లాక్ బస్టర్ తో మరో హిట్ ని తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ప్రభాస్ అల్లు అర్జున్ లాంటి స్టార్ల సరసన  వరస అవకాశాలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న పూజా వరుణ్ తేజ్ వాల్మీకికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్న టాక్ కొద్దిరోజుల క్రితమే వచ్చింది.

రెమ్యునరేషన్ ఎక్కువగా అడిగిందని అయినా నిర్మాతలు ఓకే చెప్పారని అందులో ప్రచారం జరిగింది. పైగా వరుణ్ తేజ్ పూజా ఫస్ట్ మూవీ హీరో. దర్శకుడు హరీష్ శంకర్ డీజే ద్వారా తనకు బ్రేక్ ఇచ్చిన వాడు. సో ఇది సాధ్యమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అనుకున్నారంతా. కానీ ఇప్పుడు ఇది జరిగేలా లేదని టాక్. పారితోషికం విషయంలో తన గురించి జరుగుతున్న ప్రచారం పట్ల హర్ట్ అయిన పూజా వాల్మీకి ఆఫర్ కి నో చెప్పే ఆలోచనలో ఉందట.

కేవలం 15 రోజుల కాల్ షీట్స్ అడిగినప్పటికీ ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్ రేంజ్ లో వాల్మీకి ఉండదు కాబట్టి ఆ కోణంలో కూడా వద్దని చెప్పడమే బెటరని ఫీలయ్యిందట. దీనికి సంబంధించిన ఎలాంటి అఫీషియల్ అప్ డేట్స్ అందుబాటులో లేవు. హరీష్ శంకర్ ఇటీవలే తాము చెప్పే దాకా ఏది నమ్మకండని చెప్పాడు. సో ఇప్పుడీ వాల్మీకి గురించి పూజా హెగ్డే ఎంట్రీ గురించి వస్తున్న వార్తల్లో క్లారిటీ రావాలంటే ఇంకొద్ది రోజులు ఆగాల్సిందే
    

Tags:    

Similar News