నేనూ తెలంగాణ బిడ్డనే.. కంటతడిపెట్టిన పూనమ్ కౌర్

Update: 2023-03-07 12:36 GMT
నేనూ తెలంగాణ బిడ్డనే.. కంటతడిపెట్టిన పూనమ్ కౌర్
హీరోయిన్ పూనమ్ కౌర్ ఎమోషనల్ అయ్యారు. తాను తెలంగాణలో పుట్టానని.. కానీ తనను పంజాబీ అమ్మాయి అంటూ వెలివేస్తున్నారని కంటతడి పెట్టుకున్నారు. రాజ్ భవన్ లో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సినీ నటి పూనం కౌర్ భావోద్వేగానికి గురయ్యారు. తాను తెలంగాణలోనే పుట్టి పెరిగానని.. కానీ పంజాబీ అమ్మాయి అని దూరం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

'నేను తెలంగాణ బిడ్డను.. నన్ను అలా దూరం చేయవద్దు' అని పూనమ్ పేర్కొన్నారు. ఇక వరంగల్ మెడికో ప్రీతి మరణం తనను కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రీతి మృతికి కారణమైన నిందితుడిని ఉరివేయడమే సమంజసమన్నారు. పురాణ ఇతిహాసాలు మహిళా శక్తిని బోధిస్తాయని.. మహిళల పట్ల గౌరవంగా ఉండాలని సూచించారు.

'నా మతం పేరు చెప్పి నన్ను వెలివేయకండి.. నేను తెలంగాణ బిడ్డనే' అంటూ స్టేజీపైనే కన్నీరుపెట్టుకున్నారు.  దయచేసి మైనార్టీ అని.. సిక్కు అని వేరు చేయవద్దంటూ భావోద్వేగమయ్యారు. అలాగే మెడికల్ స్టూడెంట్ ప్రీతి ఘటనపైనా స్పందించారు. ఆమెకు జరిగింది అన్యాయమని.. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు.          



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News