తెలుగు ప్రేక్షకుల ముందుకు డేగ.. మిర్చిలాంటి కుర్రాడు సినిమాలతో వచ్చిన ప్రగ్యా జైస్వాల్ కు కంచె సినిమా తో ఒక టర్నింగ్ పాయింట్ దక్కింది. క్రిష్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా లో వరుణ్ తేజ్ కు జోడీగా ప్రగ్యా జైస్వాల్ నటించింది. ఆ సినిమా కమర్షియల్ గా భారీ విజయాన్ని సొంతం చేసుకోకున్నా కూడా ప్రగ్యా జైస్వాల్ కు మంచి పేరు గుర్తింపు దక్కింది. ఆ సినిమా వల్ల తెలుగులో వరుసగా ఆఫర్లు వచ్చాయి.
కంచె తర్వాత కాస్త బిజీ అయిన ప్రగ్యా జైస్వాల్ ఆ తర్వాత మళ్లీ ఆఫర్ల కోసం వెయిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇటీవల అఖండ మరియు సన్నాఫ్ ఇండియా సినిమాల్లో ఈ అమ్మడు నటించింది. సన్నాఫ్ ఇండియా అట్టర్ ప్లాప్ అయినా కూడా అఖండ సినిమా ఏ స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకుందే అందరికి తెల్సిందే. అయినా కూడా ప్రగ్యా జైస్వాల్ ను ఫిల్మ్ మేకర్స్ పట్టించుకోవడం లేదు.
హీరోయిన్ గా అఖండ విజయం ఈ అమ్మడికి పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. చిన్నా చితక ఆఫర్లు వచ్చినా కూడా చేసేందుకు సిద్దం అన్నట్లుగా ఉన్నా కూడా ఈ అమ్మడికి ఆ ఆఫర్లు కూడా రావడం లేదు అనేది పుకారు. సోషల్ మీడియాలో హాట్ ఫోటోలు షేర్ చేస్తూ ప్రతి ఒక్కరితో వావ్ అనిపించుకుంటూ ఉన్న ఈ అమ్మడు ముందు ముందు అయినా మంచి ఆఫర్లు వస్తాయేమో అనే నమ్మకంతో సోషల్ మీడియాలో అందాల ఆరబోత చేస్తోంది.
ప్రగ్యా జైస్వాల్ గతంలో కొన్ని అనవసర సినిమాల్లో నటించడం వల్లే ఇప్పుడు ఈ పరిస్థితి అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పొడుగు కాళ్ళ సుందరి.. బాలీవుడ్ హీరోయిన్ ఫీచర్స్ ఫుల్ గా ఉన్న ప్రగ్యా జైస్వాల్ కు లక్ కలిసి రాకపోవడం వల్ల కూడా ఆఫర్లు అంతగా రాలేదు.
మొత్తానికి ఈ అమ్మడు ఇంకా ఆఫర్ల కోసం పాపం వెయిట్ చేయాల్సిన పరిస్థితి. అందంతో పాటు మంచి నటన ప్రతిభ ఉన్నా కూడా ప్రగ్యాను ఫిల్మ్ మేకర్స్ ఎందుకు పట్టించుకోవడం లేదో అర్థం కావడం లేదు అంటూ ఆమె అభిమానులు కామెంట్స్ చేస్తూ ఉన్నారు.