కెనడాలో కారు ప్రమాదానికి గురైన సీనియర్ హీరోయిన్.. !

Update: 2022-11-01 05:33 GMT
సీనియర్ హీరోయిన్ రంభ కెనడాలో కారు ప్రమాదానికి గురైంది. ఈ విషయాన్ని రంభ తన సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఆమె పరిస్థితిపై టాలీవుడ్ ప్రముఖులు.. అభిమానులు ఆరా తీస్తున్నారు. ఈ ప్రమాదంలో ఆమెతోపాటు తన కూతురు సాషా ఉందని తెలుస్తోంది. దీంతో వీరిద్దరి పరిస్థితి ఎలా ఉందని అభిమానులు కలవరపాటుకు గురవుతున్నారు.

విజయవాడకు చెందిన విజయలక్ష్మి ఆలియాస్ రంభ టాలీవుడ్ ఇండస్ట్రీలోకి 'ఆ ఒక్కటి అడక్కు' సినిమాతో అరంగ్రేటం చేశారు. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ జోడిగా రంభ నటించింది. ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో రంభకు వరుస ఆఫర్లు వెల్లువెత్తాయి.

నటనతోపాటు గ్లామర్ షో చేయడానికి రంభ ఎప్పుడు వెనుకడుగు వేయలేదు. దీంతో ఈ భామ టాలీవుడ్ లోని టాప్ హీరోలందరి సరసన నటించే అవకాశం దక్కింది. మెగాస్టార్ చిరంజీవి.. రజనీకాంత్.. కమల్ హాసన్..  బాలకృష్ణ.. విక్టరీ వెంకటేష్.. నాగార్జున.. సుమన్.. అర్జున్.. జేడీ చక్రవర్తి తదితర హీరోలందరితో నటించి ఎన్నో సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది.

90స్ హీరోయిన్లో రంభ టాప్ హీరోయిన్ కొన్నాళ్లపాటు కొనసాగింది. ఈ భామ తెలుగులోనే  కాకుండా తమిళం.. మలయాళం.. కన్నడ.. భోజ్ పురి.. పలు ఇంగ్లీష్ సినిమాల్లోనూ నటించిది. దక్షిణాదిలోని టాప్ హీరోయిన్లలో రంభ ఒకరిగా నిలిచారు. తెలుగులోనే కాకుండా ఇక సినిమాల్లో ఆఫర్లు తగ్గుతున్న సమయంలో రంభ వివాహం చేసుకున్నారు.

కెనాడాకు చెందిన తమిళ వ్యాపారవేత్త ఇంద్ర కుమార్ పద్మనాథన్ ను వివాహం చేసుకుంది. 2010 ఏప్రిల్ 8న వీరి వివాహం జరిగింది. నాటి నుంచి రంభ కెనడాలో స్థిరపడిపోయింది. రంభకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పెళ్లి తర్వాత కొద్ది రోజులు సినిమాలకు దూరంగా ఉన్న అడుపదడుపా గెస్ట్ రోల్స్ లో కన్పించింది. అయితే పలు డాన్స్ షోలకు జడ్జిగా చేస్తూ బీజీగా మారింది.

తాజాగా తన టోరంటోలో స్కూల్ నుంచి తన కూతురు సాషాను కారులో తీసుకొస్తుండగా రంభ యాక్సిడెంట్ కు గురైంది. ఈ ప్రమాదంలో తన కూతురు సాషాకు తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటోంది. ఈ ఘోర ప్రమాదం నుంచి తాను తృటితో తప్పించుకున్నానని.. తన కూతురు త్వరగా కోలువాలని అభిమానులు ప్రార్థించాలని రంభ తన సోషల్ మీడియాలో కోరింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News