పిక్ టాక్ : మిల్కీ బ్యూటీ ఇంకా అదే అందం
డిఫరెంట్ ఔట్ ఫిట్‌లో కాస్త నడుము కనిపించేలా చీర కట్టుని తలపించేలా తమన్నా ఆకట్టుకుంది.
మిల్కీ బ్యూటీ తమన్నా సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి దాదాపుగా ఇరవై సంవత్సరాలు అయింది. ఇప్పటికీ బిజీ బిజీగా ప్రాజెక్ట్‌లు చేస్తోంది. టాలీవుడ్లో ఈమె సినిమాలు తగ్గినా ఉత్తర భారతంలో ఈ అమ్మడి క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. వరుసగా సినిమాలు చేస్తోంది. సోషల్ మీడియాలోనూ ఈ అమ్మడి జోరు కంటిన్యూ అవుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ అమ్మడికి దాదాపు 27.5 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ రేంజ్లో ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న ఈ అమ్మడు అదే స్థాయిలో అందమైన ఫోటోలను షేర్ చేయడం ద్వారా తన ఫాలోవర్స్‌కి వినోదాన్ని పంచుతూ ఉంటుంది.
మరోసారి తమన్నా తన అందమైన ఫోటోలను షేర్ చేసింది. డిఫరెంట్ ఔట్ ఫిట్‌లో కాస్త నడుము కనిపించేలా చీర కట్టుని తలపించేలా తమన్నా ఆకట్టుకుంది. ఎప్పటిలాగే సింపుల్ అండ్ స్వీట్ అంటూ తమన్నా షేర్ చేసిన ఈ ఫోటోలకు కామెంట్స్ చేస్తున్నారు. తమన్నా మూడు పదుల వయసు దాటినా అదే అందం అంటూ అభినందిస్తున్న వారు చాలా మంది ఉన్నారు. ఇంకా స్టార్ హీరోలకు జోడీగా నటించే అవకాశం ఉన్న అందం ఈ అమ్మడిది అంటూ కామెంట్స్ చేస్తున్న వారు చాలా మంది ఉన్నారు.
బాలీవుడ్లో చాంద్ సా రోషన్ చెహ్రా సినిమాలో నటించడం ద్వారా సినిమా జీవితంను ప్రారంభించిన తమన్నా తెలుగు లో 2005 సంవత్సరంలో శ్రీ సినిమాతో అడుగు పెట్టింది. తక్కువ సమయంలోనే ఈ అమ్మడికి మంచి ఆఫర్లు వచ్చాయి. ముఖ్యంగా 2007లో వచ్చిన హ్యాపీ డేస్ కారణంగా తమన్నా మొత్తం కెరీర్ మారిపోయింది. 2009లో వచ్చిన కొంచెం ఇష్టం కొంచెం కష్టం సినిమాలో తమన్నా నటనకి మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత స్టార్ హీరోలు ఎన్టీఆర్, ప్రభాస్, చరణ్, అల్లు అర్జున్, రవితేజ, చిరంజీవి వంటి స్టార్స్ తో నటించింది.
కోలీవుడ్‌లోనూ ఈ అమ్మడు వరుసగా సినిమాలు చేసి మంచి పేరును సొంతం చేసుకుంది. బాలీవుడ్లో ఈ అమ్మడు పలు సినిమాల్లో నటించినా ఆశించిన స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకోలేదు. అయినా కూడా అక్కడ ఆఫర్లు సొంతం చేసుకుంటూనే ఉంది. ఈ మధ్య కాలంలో ఐటెం సాంగ్స్ తో ఈ అమ్మడు తెగ సందడి చేస్తోంది. సినిమాలు, సిరీస్‌లు, ఐటెం సాంగ్స్‌తో పాటు మ్యూజిక్ ఆల్బమ్ లు సైతం చేస్తున్న ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. అందుకే అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్‌ను ఇన్‌స్టాలో ఈ అమ్మడు సొంతం చేసుకుంది. ముందు ముందు మళ్లీ ఈ అమ్మడు టాలీవుడ్లో బిజీ అవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.