క్రేజీ బ్యూటీ అమ్మానాన్నలను కష్టపెడుతుందట

Update: 2021-08-06 05:39 GMT
హీరోయిన్ గా ప్రస్తుతం రష్మిక రేంజ్‌ ఏంటీ అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు లో పుష్ప వంటి బిగ్గెస్ట్‌ పాన్‌ ఇండియా మూవీలో నటించడంతో పాటు ఇంకా పలు సినిమాల్లో నటిస్తుంది. ఇక తమిళం విషయానికి వస్తే బడా హీరోలకు జోడీగా ఈమె నటించేందుకు ఇప్పటికే కమిట్‌ అయ్యింది. తాజాగా ఈ బాలీవుడ్‌ లో కూడా బిజీ అయ్యింది. హిందీలో అమితాబచ్చన్‌ వంటి బిగ్గెస్ట్‌ స్టార్‌ తో కలిసి నటించే అవకాశంను కూడా ఈమె దక్కించుకుంది. తెలుగు.. తమిళం.. హిందీ.. కన్నడ భాషల్లో ఒకే సారి సినిమాలు చేస్తున్న ఏకైక ముద్దుగుమ్మగా రష్మిక మందన్నా పేరు దక్కించుకుంది.

అంతటి స్టార్‌ డమ్‌ మరియు క్రేజ్‌ ను దక్కించుకున్న ఈ అమ్మడు క్షణం తీరిక లేకుండా అన్నట్లుగా సినిమాల్లో నటిస్తోంది. ఒక్కోసారి ఒకే రోజు రెండు సినిమాల షూటింగ్‌ ల్లో కూడా ఈమె పాల్గొంటున్న సందర్బాలు ఉన్నాయి. ఇంత బిజీగా ఉన్న ఈ అమ్మడి తల్లిదండ్రులను కష్టపెడుతుందట. ఆ విషయాన్ని స్వయంగా తానే వెళ్లడించింది. అమ్మా నాన్నను ఇబ్బంది పెట్టడం వారి మాట వినక పోవడం తప్పే కాని తప్పడం లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. అసలు విషయం ఏంటీ అంటే ప్రస్తుతం కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. కరోనా వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు.

ఆ కారణంగా చాలా మంది స్టార్స్ సినిమాలు అంటే భయపడుతున్నారు. అలాంటిది రష్మిక మందన్నా ఒక్క రోజు కూడా తీరిక లేకుండా సినిమా షూటింగ్‌ లకు హాజరు అవ్వడం వాళ్ల అమ్మా నాన్నకు నచ్చడం లేదట. బయట పరిస్థితులు అస్సలు బాగా లేవు. నీవు షూటింగ్‌ లకు వెళ్లవద్దని ఇద్దరు కూడా చెబుతున్నా కూడా వారి మాట వినకుండా షూటింగ్ లకు రష్మిక హాజరు అవుతుందట. తాను ఇప్పటికే పెద్ద సినిమాలు కమిట్‌ అయ్యాను. ఈ సమయంలో సినిమాల ఆఫర్లను కాదనలేను కనుక ఈ పరిస్థితుల్లో కూడా కరోనాకు భయం లేకుండా షూటింగ్ లకు వెళ్లాల్సి వస్తుంది అంటూ చెప్పుకొచ్చింది.

వారి మాట వినకుండా షూటింగ్ లకు వెళ్లడం వారిని బాధ పెట్టడమే అని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుందట. సన్నిహితుల వద్ద తన యొక్క పరిస్థితిని ఆమె తెలియజేసి బాధ పడుతుందట. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్లుగా హీరోయిన్స్‌ కూడా ఆఫర్లు వచ్చినప్పుడే సినిమాను చేయాలి. ఆ తర్వాత చేద్దాం అనుకుంటే ఆఫర్లు రావచ్చు రాకపోవచ్చు. ఆ విషయం రష్మికకు బాగా తెలుసు. అందుకే ఆమె కరోనా భయం ఉన్నా కూడా సినిమాల షూటింగ్‌ లకు కంటిన్యూస్ గా హాజరు అవుతూనే ఉంది.




Tags:    

Similar News